పబ్లిసిటీ ఎక్కువ.. ప్రేక్షకులు తక్కువ

అయితే అందరి అంచనాలు తలక్రిందలు చేస్తూ ఈ సినిమా కథ,కథనాలు సరిగా లేక మొదట ఆట నుండే బ్యాడ్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉదయ్ కిరణ్ డైలమోలో పడ్డారు. ఇక కాల్ సెంటర్ సి గ్రేడ్ కామిడీతో వచ్చింది. నవ్వకుండా ఎవరైనా థియోటర్ నుండి బయిటకు వస్తే మూడు లక్షలు బహుమతి ఇస్తామన్న నిర్మాత ని మాటలుకి అంతా నవ్వుకుంటున్నారు. నా పంచప్రాణం,హాట్ మనీ, మహా యజ్ఞం వంటి సినిమాలను పట్టించుకునే వారే కరువయ్యారు. చాలామందికి ఈ సినిమాలు రిలీజ్ అయినట్లు తెలియక పోవటమే విశేషం.
రాఖీ సావంత్ నటించినా హాట మనీ కీ హాట్ హాట్ గా ప్రేక్షకులు పోవటం లేదు. ఆ తరహా ట్రెండ్ పోయినట్లు కనపడుతోంది. ఇక పరిశ్రమలో ఓ ప్రక్క చిన్న సినిమాని బ్రతికించాలని అందరూ కోరుతూంటే...చిన్న సినిమాలన్నీ ఇలా విరక్తి కలిగేంచేలా రూపొందటం అందరినీ ఆలోచింపచేస్తోంది. మరో ప్రక్క రెడీ సినిమా వందరోజుల వైపు వేగంగా పరుగెడుతోంది. హోమం, బలాదూర్ పబ్లిసిటీ ఎక్కువ ప్రేక్షకులు తక్కువ అన్నట్లు తయారయ్యాయి.
ఇక అష్టాచమ్మ సినిమా ఇప్పటికీ మొదటి స్ధానంలో కొనసాగుతోంది. మొదట మల్టీఫ్లెక్స్ అన్న ఈ సినిమా ఎ,బి సెంటర్ల లలో కూడూ కలెక్షన్స్ బాగానే సంపాదిస్తోంది. 17 ప్రింట్లతో రిలీజైన అష్టాచెమ్మా నేటి నుంచీ 35 ప్రింట్లు పెంచుకుని ముందుకు వెళ్తోంది. మూడవ వారం లోకి ప్రవేశించిన ఈ సినిమా హిట్టవటం మంచి సినిమా స్టామినాని తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











