ప్రతాపం చూపిస్తున్న 'అశ్వథ్థామ'.. బ్రేక్ ఈవెన్ దగ్గర్లో మూవీ కలెక్షన్స్
విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య.. ఈ సారి తన సొంత కథతో 'అశ్వథ్థామ' రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జనవరి 31న విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే మిశ్రమ స్పందన తెచ్చుకొని థియేటర్స్‌లో డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. కలెక్షన్స్ కూడా చెప్పుకోదగినవిగా నమోదవుతున్నాయి. మరి ఇప్పటిదాకా 'అశ్వథ్థామ' ఎంత వసూలు చేశాడు? బ్రేక్ ఈవెన్ చేరేనా? ఆ వివరాలు చూద్దామా..

సరికొత్త జానర్.. నాగశౌర్య న్యూ స్టైల్
తెలుగు చిత్రసీమలో ఇప్పటిదాకా లవర్ బాయ్ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఈ సారి ట్రాక్ మార్చేశాడు. సరికొత్త జానర్ టచ్ చేస్తూ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మేరకు సొంతంగా కథ రాసుకొని 'అశ్వథ్థామ' రూపంలో ఎంట్రీ ఇచ్చాడు.

అశ్వథ్థామ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
అశ్వథ్థామ సినిమాకు ఇప్పటిదాకా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయని లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాల హంగామా మెల్లగా తగ్గుతుండటం అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని సినిమా థియేటర్స్ యాడ్ కానున్నాయని తెలుస్తోంది.

బ్రేక్ ఈవెన్ దాటాలంటే ఇంకా..
మరో 30 శాతం మేర కలెక్షన్స్ వచ్చాయంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసినట్లే. ఈ వారం ముగిసేదాకా ఇప్పటిలాగే అన్ని ఏరియాల్లో డీసెంట్ రన్ కొనసాగితే 'అశ్వథ్థామ' బ్రేక్ ఈవెన్ దాటడం చాలా సులువే అంటున్నారు ట్రేడ్ పండితులు.

అశ్వథ్థామ ప్రీ రిలీజ్ బిజినెస్
యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో మరో మూడు నాలుగు రోజులు ఈ మూవీకి కలిసొస్తే బ్రేక్ ఈవెన్ ఖాయమే. చిత్రంలో నాగశౌర్య నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు.

సొంత బ్యానర్.. మెహ్రీన్‌తో రొమాన్స్
అన్యాయం జరుగుతుంటే తప్పని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరూ అశ్వథ్థాములే అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఈ సినిమాను రూపొందించిన హీరో నాగశౌర్య.. దర్శకత్వ బాధ్యతలను రమణ తేజ చేతుల్లో పెట్టాడు. చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











