దుమ్ములేపిన అశ్వథ్థామ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్
లవర్ బాయ్ పాత్రలు చేస్తూ పక్కింటి కుర్రాడిలా కనిపించిన నాగ శౌర్య.. ప్రస్తుతం రూట్ మార్చాడు. అమ్మాయిలను మోసం చేసే ఓ సైకోను మట్టుబెట్టే పాత్రలో అశ్వథ్థామగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయింది. దీంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు ప్రకటించారు. ఓసారి ఆ లెక్కలేంటో చూద్దాం.

కథ రాసుకున్న నాగ శౌర్య..
ఛలో వంటి సూపర్ హిట్ కొట్టిన నాగశౌర్య.. ఆపై నర్తనశాల అంటూ బొక్కాబోర్లా పడ్డాడు. అయితే మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని సొంతంగా కథ రాసుకుని అశ్వథ్థామ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఆశించినట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువై లెక్కల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
అశ్వథ్థామ టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేయడంతో భారీ రేటుకే కొనుగోలు చేశారని టాక్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా అండ్ కర్ణాటక కలిపి 1.5కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిపి 6.5కోట్లకు అమ్మినట్టుట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

మొదటి నుంచి దూకుడు..
జనవరి 31న విడుదలైన అశ్వథ్థామ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకపోయింది. సరిలేరు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇంకా నిలకడగా ఆడుతున్నా.. మంచి ఓపెనింగ్సే రాబట్టుకున్నాడు. మొదటి రోజే దాదాపు 4 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టు వెల్లడించారు.
తాజాగా బ్రేక్ ఈవెన్..
అశ్వథ్థామ కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా ఐదు రోజుల్లో 13.65కోట్లను కొల్లగొట్టిందని ప్రకటించారు. అంతే కాకుండా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











