Aswathama మొదటి రోజు ఎంత కొల్లగొట్టాడంటే..?
సంక్రాంతి సీజన్ ముగిసింది. కానీ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల జోరు మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంకా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టు యుద్దం చేస్తూ ఉంటే.. వీరి మధ్యలో యంగ్ హీరో నాగశౌర్య 'అశ్వథ్థామ'తో ఎంట్రీ ఇచ్చాడు. మరి మొదటి రోజు అశ్వథ్థాముడు ఏ రేంజ్ వసూళ్లను రాబట్టిందో ఓ సారి చూద్దాం.

డిఫరెంట్ రోల్..
యువ హీరో నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్‌తో ఇంత కాలం నెట్టుకొచ్చాడు. ఇక ఆ తరహా పాత్రలు చేసి బోర్ కొట్టిందని చెప్పుకొచ్చాడు. అందుకే కొత్త జానర్‌ను టచ్ చేశానని, అందుకే అశ్వథ్థామ లాంటి సినిమాను చేశానని సినిమా ప్రమోషన్స్‌లో స్పీచ్‌లు ఇచ్చాడు.

కొత్త కాన్సెప్ట్..
ప్రస్తుత కాలానికి అనుగుణంగా అందరూ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో అశ్వథ్థామను తెరకెక్కించాడు. అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలను నేపథ్యంగా తీసుకుని, తన స్నేహితుడి సోదరికి జరిగిన సంఘటన ఆధారంగానే తాను ఈ కథ రాశానని, రాసేప్పుడే ఎమోషనల్ అయ్యానని సినిమాపై హైప్ పెంచాడు.

పాజిటివ్ టాక్..
హీరో చెప్పినట్టుగానే ప్రేక్షకులు కూడా ఫీలయ్యారని వారి కామెంట్లను చూస్తేనే అర్థమవుతోంది. మొదటి ఆట నుంచి అశ్వథ్థామకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను దాదాపు 6.5కోట్ల రేంజ్‌లో అమ్మినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 7.2కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. అయితే ఈ క్రమంలో మొదటి రోజు ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం.

ఓ మోస్తరుగా మొదటి రోజు..
ఓ వైపు అల, మరోవైపు సరిలేరు రెండూ దుమ్ములేపుతున్నాయి. ఈ సమయంలో అశ్వథ్థామకు మంచి ఓపెనింగ్స్ ఆశించలేము. ఆన్‌లైన్ టిక్కెట్ల సరళిని చూస్తే 70 నుంచి 80లక్షలు కొల్లగొట్టే అవకాశం ఉందని టాక్. అయితే ఆఫ్‌లైన్ టిక్కెట్లు కూడా బాగానే తెగి ఉంటే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి రూపాయలు వసూళ్ల చేయవచ్చని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











