రెండు రోజుల్లో ‘అశ్వథ్థామ’ కలెక్షన్స్: పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి..
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ రసవత్తరంగా సాగుతోంది. పెద్ద సినిమాలు మొదలుకొని చిన్న సినిమాల వరకు సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నీ సత్తా చాటుతున్నాయి. ఓ వైపు ''అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు'' యుద్దం నడుస్తుండగానే యంగ్ హీరో నాగశౌర్య 'అశ్వథ్థామ'తో ఎంటరై రాణిస్తున్నాడు. జనవరి 31న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లు చూద్దామా..

సరికొత్త జానర్.. అశ్వథ్థామ రూపంలో ఎంట్రీ
ఇంత కాలం లవర్ బాయ్ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఈ సారి ట్రాక్ మార్చేశాడు. సరికొత్త జానర్ టచ్ చేస్తూ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మేరకు సొంతంగా కథ రాసుకొని అశ్వథ్థామ రూపంలో ఎంట్రీ ఇచ్చాడు.

అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు.. అందుకే
అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలను నేపథ్యంగా తీసుకుని, తన స్నేహితుడి సోదరికి జరిగిన సంఘటన ఆధారంగానే తాను ఈ కథ రాశానని, రాసేప్పుడే ఎమోషనల్ అయ్యానని సినిమాపై హైప్ పెంచాడు నాగశౌర్య. మొత్తానికి ప్రస్తుత కాలానికి అనుగుణంగా అందరూ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో అశ్వథ్థామను తెరకెక్కించాడు.

అశ్వథ్థామ ప్రీ రిలీజ్ బిజినెస్
తొలి షోతోనే అశ్వథ్థామకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను దాదాపు 6.5కోట్ల రేంజ్‌లో అమ్మారని, 7.2కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని తెలిసింది. ఈ క్రమంలో రెండో రోజే ఆ ఫీట్ దగ్గరకు వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

రెండో రోజు పూర్తయ్యే సరికి కలెక్షన్స్
అశ్వథ్థామ సినిమాకు రెండో రోజు పూర్తయ్యే సరికి 7.05 కోట్ల రూపాయలు వచ్చాయని లేటెస్ట్ రిపోర్ట్. ఈ మేరకు తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మాసివ్ బ్లాక్ బస్టర్ సినిమా అని పేర్కొంది చిత్రయూనిట్. ఈ సినిమా స్పందన చూసి తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని సినిమా థియేటర్స్ యాడ్ అవుతున్నాయని అంటున్నారు యూనిట్ సభ్యులు. మొత్తానికి నాగశౌర్య అంచనాలను రీచ్ అయినట్లే అనే టాక్ వచ్చింది.


Click it and Unblock the Notifications











