Athadu 4K Advance Collections: అతడు రీరిలీజ్ కలెక్షన్లు.. అడ్వాన్స్ బుకింగ్‌లో మహేష్ సంచలనం

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై దుగ్గిరాల కిషోర్, మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజైంది. థియేట్రికల్‌గా, టెలివిజన్ తెరపై అత్యధిక మంది వీక్షించిన పాపలారిటీగా సినిమా నిలిచింది. ఈ చిత్రంలో త్రిషా, సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, ధర్మసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సుధా, హేహ తదితరులు నటించారు.

గత రెండు దశాబ్దాల కాలంలో కల్ట్ మూవీగా పేరు సంపాదించిన ఈ చిత్రం మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9వ తేదీన రీ రిలీజ్ అవుతున్నది. 20 ఏళ్ల క్రితం ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ పుల్ రన్‌లో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో మార్కెట్‌ను ఓపెన్ చేసింది. ఈ చిత్రం 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏకధాటిగా 175 రోజులు ఆడటమే కాకుండా 1.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Athadu 4K Advance Booking Collections

అయితే మహేష్ బాబు 50వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాత మురళీ మోహన్ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అతడు సినిమాను 4K, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4K సినిమా ఫార్మాట్‌లో రూపొందించారు. లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్తో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్4K టెక్నాలజీతో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అతడు మూవీకి ఉన్న కల్ట్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అట్టహాసంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అత్యథిక స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను సుమారుగా 200 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రా, నైజాం, కర్ణాటక, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రీ సేల్స్‌కు రీ రిలీజ్ సినిమాల విషయంలో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది.

అతడు సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఈ మూవీకి 1 కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హైదరాబాద్‌లోనే ఈ సినిమా బుక్ మై షో ద్వారా 55 శాతం ఆక్యుపెన్సీతో 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్యంత వేగంగా 1 కోటి రూపాయలు సాధించిన సినిమాగా ఓ రికార్డును క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X