Athadu 4K Day 1 Collections: ఖలేజా కలెక్షన్లను బ్రేక్ చేయని అతడు! మహేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై దుగ్గిరాల కిషోర్, మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజైంది. థియేట్రికల్‌గా, టెలివిజన్ తెరపై అత్యధిక మంది వీక్షించిన పాపలారిటీగా సినిమా నిలిచింది. ఈ చిత్రంలో త్రిషా, సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, ధర్మసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సుధా, హేహ తదితరులు నటించారు.

20 ఏళ్ల క్రితం ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ పుల్ రన్‌లో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో మార్కెట్‌ను ఓపెన్ చేసింది. ఈ చిత్రం 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏకధాటిగా 175 రోజులు ఆడటమే కాకుండా 1.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Athadu 4K Day 1

మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9వ తేదీన ఆయన 50వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాత మురళీ మోహన్ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను 4K, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4K సినిమా ఫార్మాట్‌లో రూపొందించారు. లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్తో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్4K టెక్నాలజీతో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను సుమారుగా 200 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆంధ్రా, నైజాం, కర్ణాటక, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ ప్రీ సేల్స్‌కు మంచి స్పందన లభించింది. హైదరాబాద్‌ సిటీలో మొత్తం 14 షోలను ప్రీమియర్ల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ల ద్వారా సుమారుగా 7.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు 125 షోలు ప్లాన్ చేయగా.. సుమారుగా 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ప్రీమియర్లు, డే 1 కలిపి ఈ చిత్రం హైదరాబాద్‌లో 77.5 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికాలో ఈ చిత్రం భారీగానే రెస్సాన్స్ సంపాదించింది. అమెరికాలో మొత్తం 230 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రం మొత్తంగా 40 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. యూకే, ఆస్ట్రేలియాలో భారీగానే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అతడు చిత్రం తెలుగు రాష్ట్రాలు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కర్నాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి రికార్డు స్థాయిలోనే వసూళ్లు నమోదు చేస్తుంది. ఈ సినిమా తొలి రోజు ప్రీమియర్లతో కలిపి మొత్తంగా 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఖలేజాను మించి ఈ సినిమా వసూళ్లను రాబడుతుందా? అనే విషయంపై అనేక సందేహాలు ఉన్నాయి. అందుకు కారణం ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి ఎక్కువగా థియేటర్లు లభించకపోవడం ఓ కారణం అంటున్నారు. థియేటర్లలో మహావీర్ నరసింహ, కింగ్డమ్, సు ఫ్రమ్ సో చిత్రాలు బలంగా ఉండటమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అంతే కాకుండా కూలీ, వార్ 2 సినిమాలకు భారీ అడ్వాన్స్ బుకింగ్ జరగడం మరో కారణం అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X