Athadu Re Release Collections: గబ్బర్ సింగ్ కొట్టలేకపోయిన అతడు.. మహేష్ మూవీ రీ రిలీజ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంట
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై దుగ్గిరాల కిషోర్, మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజైంది. థియేట్రికల్‌గా, టెలివిజన్ తెరపై అత్యధిక మంది వీక్షించిన పాపలారిటీగా సినిమా నిలిచింది. ఈ చిత్రంలో త్రిషా, సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, ధర్మసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సుధా, హేహ తదితరులు నటించారు.
20 ఏళ్ల క్రితం ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ పుల్ రన్‌లో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు ఓవర్సీస్‌లో మార్కెట్‌ను ఓపెన్ చేసింది. ఈ చిత్రం 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏకధాటిగా 175 రోజులు ఆడటమే కాకుండా 1.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మహేష్ బాబు 50వ పుట్టిన రోజు ఆగస్టు 9వ తేదీని పురస్కరించుకొని ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాత మురళీ మోహన్ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను 4K, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4K సినిమా ఫార్మాట్‌లో రూపొందించారు. లేటేస్ట్ టెక్నాలజీ హంగులతో ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్తో రిలీజ్ అయింది. ఈ సినిమా ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్4K టెక్నాలజీతో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సుమారుగా 200 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
అతడు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో మంచి స్పందన లభించింది. ఈ సినిమా సెంచరీ కొట్టింది అంటూ నార్త్ అమెరికా డిస్టిబ్యూటర్ ప్రత్యాంగిరా సినిమాస్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన సత్తాను చాటాడు. అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని సులభంగా సొంతం చేసుకొన్నాడు. యూఎస్ఏ బాక్సాఫీస్ చక్రవర్తి అని తనకు తాను మరోసారి రుజువు చేసుకొన్నాడు. ఈ చిత్రం 100K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 88 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతున్నది అని వెల్లడించారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. బుక్ మై షోలో ఈ సినిమాకు భారీగానే స్పందన లభించింది. మొత్తంగా 150K టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు ఈ సినిమా నైజాంలో 1.62 కోట్లు, సీడెడ్‌లో 28 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 27 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 24 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 లక్షలు, గుంటూరు జిల్లాలో 25 లక్షలు, కృష్ణా జిల్లాలో 25 లక్షలు, నెల్లూరులో 10 లక్షలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా 3.2 కోట్ల రూపాయలు రాబట్టింది.
కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా 22 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆంధ్రా, తెలంగాణ, ఓవర్సీస్ కలిపి ఈ సినిమా మొత్తంగా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రీ మాస్టరింగ్ కోసం సుమారుగా 8 కోట్ల రూపాయల మేర ఖర్చు అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సుమారుగా 8.5 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఆదివారం వరకు వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.
ఈ చిత్రంపై పెట్టుకొన్న భారీ అంచనాలకు తగినట్టుగా వసూళ్లను రాబట్టలేకపోయిందనే విషయం తాజాగా కలెక్షన్లతో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే గతంలో రిలీజైన బిజినెస్‌మ్యాన్, మురారీ, గబ్బర్ సింగ్, ఖలేజా సినిమాల కంటే తక్కువగానే వసూలు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











