Athidhi Re-Release Day 1 Collections: రీ రిలీజ్‌లో అతిథికి షాకింగ్ కలెక్షన్స్.. మహేశ్ మూవీకి ఎంతంటే?

గత కొన్నేళ్లుగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రీ రిలీజ్ కల్చర్ బాగా ఎక్కువైంది. తమ అభిమాన తారల పుట్టినరోజులు లేక మరేదైనా సందర్భాన్ని పురస్కరించుకుని హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇవి అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందడంతో పాటు నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు రీ రిలీజ్‌లోనూ డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా టాలీవుడ్ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు మహేశ్ బాబు నటించిన అతిథి మూవీని మే 29న రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అతిథి కలెక్షన్స్ ఎంత? ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

అతిథి తారాగణం
యూటీవీ మోషన్ పిక్చర్స్, కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా ఈ అతిథి సినిమాను నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు సరసన అమృతా రావు హీరోయిన్‌గా నటించారు. మురళీ శర్మ, ఆశిష్ విద్యార్ధి, కోటా శ్రీనివాసరావు, అజయ్, నాజర్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా స్పెషల్ సాంగ్‌తో అలరించారు. అతిథి చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. గౌతమ్ రాజు ఎడిటర్‌గా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు.

Athidhi Re-Release Day 1 Collections Mahesh Babu s film Disappoints at Box Office

అతిథి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి అతిథి మూవీని దాదాపు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. 2007 అక్టోబర్ 18న అతిథి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా సూపర్‌స్టార్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఆంధ్రా- నైజాంలలో 21 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.60 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 80 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.71 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 25.11 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది.

రీ రిలీజ్‌లో అతిథికి షాక్
సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 29న అతిథిని 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఏమాత్రం రెస్పాన్స్ రావడం లేదు. అడ్వాన్స్ బుకింగ్‌లోనూ అతిథికి స్పందన దక్కలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన కేంద్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మినహా మల్టీప్లెక్స్‌లలో ఆక్యూపెన్సీ కనిపించడం లేదు. ఇదే కాదు.. మహేశ్ బాబు అడ్డగా గుర్తింపు తెచ్చుకున్న నార్త్ అమెరికాలోనూ అతిథిని పట్టించుకోవడం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అతిథి రీ రిలీజ్ తొలిరోజు కలెక్షన్స్
అతిథి రీ రిలీజ్‌లో తొలిరోజున నైజాంలో 35 లక్షల రూపాయలు, సీడెడ్‌లో 4 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 20 లక్షల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 59 లక్షల రూపాయలు రాబట్టింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 2 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 లక్షల రూపాయలు చొప్పున తొలిరోజున అతిథి రీ రిలీజ్‌లో వరల్డ్ వైడ్‌గా కేవలం 64 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగిందని విశ్లేషకులు తెలిపారు. రీ రిలీజ్‌లలో రికార్డ్ కలెక్షన్స్‌తో చరిత్ర సృష్టించిన మహేశ్‌ బాబుకు అతిథి రీ రిలీజ్ మాత్రం షాకిచ్చిందని అంటున్నారు.

రీ రిలీజ్‌లకు ఎండ్ కార్డేనా?
నెలకొక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో రీ రిలీజ్‌ల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని ఫలితంగానే అతిథిని జనం పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్‌మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మహేశ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరని.. అతిథి సినిమాపై ఆ స్థాయిలో బజ్ లేకపోవడం కూడా ఈసారి దెబ్బకొట్టిందని అంటున్నారు. అతిథి రిజల్ట్‌ నేపథ్యంలో కొంతకాలం రీ రిలీజ్‌ ట్రెండ్‌కు టాలీవుడ్‌లో బ్రేక్‌లు పడే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X