Athidhi Re Release Total Collections: అతిథి రీరిలీజ్ టోటల్ కలెక్షన్లు.. మహేష్ మూవీ రిలీజ్ ఖర్చులు కూడా రాలేదట!

ప్రిన్స్ మహేష్ బాబు నటిచంిన అతిథి చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు యూటీవీ మోషన్ పిక్చర్స్, కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై ఘట్టమనేని రమేశ్ బాబు, రోనీ స్క్రూవాలా అతిథి సినిమాను నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు సరసన అమృతా రావు హీరోయిన్‌గా నటించారు. మురళీ శర్మ, ఆశిష్ విద్యార్ధి, కోటా శ్రీనివాసరావు, అజయ్, నాజర్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా స్పెషల్ సాంగ్‌తో అలరించారు. అతిథి చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. గౌతమ్ రాజు ఎడిటర్‌గా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తన అభిమానుల కోసం మహేష్ బాబు తాను నటించిన అతిథి చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అయితే మహేష్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొంటే ఈ సినిమాకు సొంత అభిమానులే పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఈ సినిమాను ప్రేక్షకులు, మహేష్ ఫ్యాన్స్ పట్టించుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది. అమెరికాలో ఈ సినిమా రిలీజ్ కోసం చేసిన ఖర్చులు కూడా రాలేదనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలు హావా కొనసాగిస్తున్న నేపథ్యంలో అతిథి చిత్రం ఆదరణ పొందకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Athidhi Re Release Total Box Office

2007 సంవత్సరంలో ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ మూవీగా చిత్రీకరించారు. ఈ సినిమాను అప్పట్లోనే 20 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణను చూరగొనలేకోపొయింది. ఈ చిత్రం మొత్తంగా 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా..అప్పటి రెస్సాన్స్ ఇప్పుడు కూడా వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అతిథి చిత్రం రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో 48 లక్షలు, ఆంధ్రాలో 40 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో 91 లక్షల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 93 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం మొత్తంగా 10160 వేల డాలర్లు అంటే.. 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 58 లోకేషన్లలో ప్రదర్శించగా 6555 డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 6.22 లక్షల రూపాయలు వసూలు చేసింది అని తెలిపారు.

ఈ సినిమా గురించి యూఎస్ ట్రేడ్ అనలిస్ట్ వెంకీ బాక్సాఫీస్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా కలెక్షన్లు రాబట్టింది. మహేష్ అభిమానులు కూడా సినిమాకు ముఖం చాటేశారు. ఈ చిత్రాన్ని అమెరికాలో రీలీజ్ చేయడానికి చేసిన ఖర్చులు కూడా రాలేదు అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X