అతిథి కన్ఫ్యూషన్!!!
రెండో వారంలో అతిథి సినిమా వసూళ్లు మందగించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ సినిమా హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్ నటులు ప్రమోషన్ లో పడ్డారు. అంతా కన్ఫ్యూషన్ గా ఉంది కదా. అవును ఒకవైపు సంచలన వసూళ్లు చేసిందని చెబుతూ మరోవైపు ప్రమోషన్ కు పాల్పడడంతోనే ఈ కన్ఫ్యూషన్. అయితే విశ్లేషకులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. ఎక్కువ థియేటర్లలో విడుదల అయిన సినిమాల పరిస్థితి ఇలానే ఉంటుందని అంటున్నారు.
మొదటి వారం హౌస్ ఫుల్ తో నడిచివా రెండో వారానికి వచ్చేసరికి సహజంగానే ఈ మార్పు ఉంటుందని అంటున్నారు. అయితే మున్ముందు భారీ సినిమాల విడుదల లేకపోవడం అతిథికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక అయిదవారం ముగిసే సమయానికి హ్యాపీడేస్ సరికొత్తగా ప్రింట్ల తయారితో 90 ప్రింట్లకు చేరుకొని సంచలనం సృష్టిస్తోంది. చిరుత పరిస్థితి అయిదవవారం ముగిసే సమయానికి వసూళ్లు 50 శాతానికి పడిపోయినట్టు సమాచారం. చందమామ విడుదల అయిన 50 రోజుల తరువాత వసూళ్లు 30 శాతానికి పడిపోయినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











