అతిథికి తగ్గిన ఆదరణ!!
దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి, నరేష్ హీరోగా రూపొందించిన సీమశాస్త్రి మంచి ఓపెనింగ్స్ తో మొదలయింది. కానీ ఈ సినిమా రూపొందింది ఫ్యాక్షన్ నేపథ్యంలో కావడం, పాత ఫ్యాక్షన్ సినిమాల కథల మేలవింపును కామెడీ చేస్తే రూపొందిన సినిమాయే సీమశాస్త్రి కావడంతో సినిమా ప్రేక్షకులు అంతగా ఆదరించడంలేదు. స్క్రిప్ట్ కొంచెం పకడ్భందీగా తయారుచేసుకొని ఇదే కామెడీ సినిమాను రూపొందిస్తే వసూళ్లలో పైన ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండోవారం వసూళ్ల మీదే ఈ సినిమా భవిత్యం ఆధారపడివుంది. నవవసంతం వసూళ్ల పరంగా ఎగుడుదిగుడు లేకుండా ప్రేక్షకులతో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. రెండోవారం 60శాతం వసూళ్లను కలిగివుందంటే స్నేహం బాగానే పనిచేస్తోందని చెప్పవచ్చు. ఉదయ్ కిరణ్ హీరోగా రూపొందిన వియ్యాల వారి కయ్యాలు, ఎమ్మెస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన భజంత్రీలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టాయని చెప్పవచ్చు. ఐదవవారంలో అతిథికి ఆదరణ తగ్గింది. వెంకటేష్ తులసి పరువాలేదన్నట్టుగా నడుస్తోంది. 50 రోజులు పూర్తిచేసుకున్న హ్యాపీడేస్ మాత్రం తన హవా ఇంకా కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications











