Athiradi 4 days Box Office: 50 కోట్లకు చేరువగా అతిరిధి.. టోవినో థామస్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళం స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ నటించిన తాజా చిత్రం అతిరధి. ఈ చిత్రంలో వినీత్ శ్రీనివాసన్, రియా శిబు, షాన్ రెహ్మాన్, దర్శన రాజేంద్రన్, జరీన్ షాహబ్, విష్ణు అగస్త్య, వినీత్ తట్టిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించారు. అనంతు ఎస్, బాసిల్ జోసెఫ్ నిర్మాతలుగా వ్యవహరించారు. సహ నిర్మాతలుగా టొవినో థామస్, సమీర్ తాహర్ వ్యవహరించారు.

ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. అరుణ్ అనిరుధన్, పౌల్సన్ స్కారియా రచనా సహకారం అందించారు. విష్ణు విజయ్ మ్యూజిక్, శామ్యుల్ హెన్నీ సినిమాటోగ్రఫి, ఛమన్ ఛాకో ఎఢిటర్‌గా, మానవ్ సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, అనంతు ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం మలయాళంలో మే 14వ తేదీన, తెలుగు రాష్ట్రాల్లో మే 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Athiradi 4 days Box Office Collections

అతిరధి సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీ ఫెస్టివల్ సెలెబ్రేషన్స్‌‌పై నిషేధం కొనసాగితే.. సామ్ కుట్టి (టొవినో థామస్) ఆ నిషేధాన్ని ఎత్తి వేయించి ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. కానీ విద్యార్థుల గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగుతారు. ఓ గ్రూపుకు సామ్ కుట్టి, మరో గ్రూపుకు నాయకుడిగా (బాసిల్ జోసెఫ్) అమీతుమీ తేల్చుకొనేందుకు రెడీ అవుతారు. దాంతో కాలేజీలో గందరగోళం నెలకొంటుంది. అయితే ఆ గొడవలను సద్దుమణిగేలా చేసి సామ్ కుట్టి ఎలా కాలేజీ ఫెస్టివల్‌ను నిర్వహించాడనేది ఈ సినిమా కథ.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను నేటితరం యువత అభిరుచికి అనుగుణంగా, స్టాండర్డ్స్‌తో తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అతిరధి సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో భారీగా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 197 పట్టణాల్లో 2000 షోలకుపైగా ప్రదర్శించారు. ఈ సినిమాకు తొలి ఆట తర్వాత సానుకూలమై టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. ఈ చిత్రం తొలి రోజు 6 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 4.2 కోట్ల గ్రాస్, మూడో రోజు 5.2 కోట్ల గ్రాస్, నాలుగో రోజు 5.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళలోనే ఈ చిత్రం 21 కోట్లకుపూగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పరిమిత ప్రదేశాల్లో, స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం కేరళేతర ప్రాంతాల్లో సుమారుగా 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాట్టింది. దాంతో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా త్వరలోనే 50 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read more about: tovino thomas box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X