‘అత్తారింటికి దారేది’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రూపొందించిన నోట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసిన నేపధ్యంలో సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక విద్యుత్ కూడా ఆపుచేయటంతో థియోటర్స్ షో లు పడటం లేదు. చాలా చోట్ల థియోటర్స్ పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఒక్క షో కూడా పడటం లేదు. దాంతో పవన్ కళ్యాణ్ నటించిన'అత్తారింటికి దారేది' చిత్రం పై ఎఫెక్ట్ పడింది.
దాంతో రెండవ వారం కలెక్షన్స్ చాలా డ్రాప్ అయ్యాయి. నైజాం మాత్రమే రెవిన్యూ సోర్స్ అయ్యింది. విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం నెలకొల్పిన తొలి కార్డు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే రెండవ వారం పరిస్ధితి తిరగబడింది.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












