Avatar 2 Collections: అవతార్ మరో సెన్సేషన్.. ఇండియాలో టాప్ మూవీగా.. ఏకంగా 8 వేల కోట్లతో రికార్డు

సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌.. గతంలో ఎప్పుడూ చూడని టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన చిత్రమే 'అవతార్'. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమాను జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు.

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా దీనికి వసూళ్లు భారీగా వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 12 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

 మరో ప్రపంచానికి తీసుకెళ్లేలా

మరో ప్రపంచానికి తీసుకెళ్లేలా

హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లొకేషన్లలో రిలీజ్ అయింది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది.

 12వ రోజు తెలుగు వసూళ్లిలా

12వ రోజు తెలుగు వసూళ్లిలా

విజువల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో పయనిస్తోంది. ఇక, రెండో వీకెండ్‌లోనూ సత్తా చాటిన ఈ మూవీ.. 12వ రోజైన మంగళవారం కాస్త వెనుకబడింది. అయినప్పటికీ దీనికి రూ. 2.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

12 రోజుల్లో తెలుగులో ఇలా

12 రోజుల్లో తెలుగులో ఇలా

'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో నైజాంలో రూ. 38.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.58 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 25.17 కోట్లతో కలిపి రూ. 72.53 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 77.20 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 12 రోజుల్లో రూ. 27.20 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు

జేమ్స్ కామెరాన్ అదృత సృష్టి అయిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ప్రతి రోజూ తక్కువలో తక్కువగా దీనికి రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతుంది. ఇలా 12 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 274.05 కోట్లు నెట్‌, రూ. 317.40 కోట్లు గ్రాస్‌ వచ్చింది. దీంతో ఈ సినిమా 2022లో టాప్ మూవీగా రికార్డును సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

క్రేజీ కాన్సెప్టుతో గ్రాండ్‌గా రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 12వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా 12 రోజుల్లో 955 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 7913.23 కోట్లు వసూలు చేసి 8వేల మార్కుకు చేరువ అయిపోయింది.

ఇండియాలో టాప్ మూవీగా

ఇండియాలో టాప్ మూవీగా

అత్యధిక బడ్జెట్‌తో హై రేంజ్ టెక్నాలజీతో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో 12 రోజుల్లో రూ. 274.05 కోట్లు నెట్ వసూలు చేసింది. తద్వారా 'బ్రహ్మాస్త్ర' రికార్డును బ్రేక్ చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే, ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి రూ. 8000 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X