Avatar 2 Collections: 15వ రోజూ అన్ని వందల కోట్లు.. 10000 కోట్లకు చేరువగా.. తెలుగులో షాకింగ్‌గా!

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో సినీ పరిశ్రమలు ఉన్నా హాలీవుడ్‌ను మాత్రమే అన్నింటికీ పెద్దన్నగా భావిస్తుంటారు. అంతలా ఇంగ్లీష్ వాళ్లు తమ భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌లపై దండయాత్ర చేస్తున్నారు. ఇలా గతంలో ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో వచ్చి కాసుల వర్షం కురిపించిన చిత్రమే 'అవతార్'. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిందే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఎన్నో అంచనాలతో వచ్చిన దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 15 రోజుల్లో ఎంత కలెక్షన్ రాబట్టిందో మీరే చూసేయండి మరి!

 క్రేజీ మూవీకి సీక్వెల్ వచ్చింది

క్రేజీ మూవీకి సీక్వెల్ వచ్చింది

హాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తీసిన మరో భారీ చిత్రమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దీంతో దీనికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

15వ రోజు తెలుగు వసూళ్లిలా

15వ రోజు తెలుగు వసూళ్లిలా

విజువల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో ముందుకెళ్తోంది. ఇక, రెండు వారాల్లోనూ సత్తా చాటిన ఈ మూవీ.. 15వ రోజైన శుక్రవారం కూడా బాగానే రాబట్టింది. ఫలితంగా దీనికి రూ. 2.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

15 రోజుల్లో తెలుగులో ఇలా

15 రోజుల్లో తెలుగులో ఇలా

15 రోజుల్లో 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 41.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 27.68 కోట్లతో కలిపి రూ. 78.83 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 83.76 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 14 రోజుల్లో రూ. 33.76 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీగానే దక్కుతున్నాయి. ప్రతి రోజూ దీనికి సగటున రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. ఇలా 15 రోజుల్లో కూడా ఇండియా మొత్తంలో రూ. 300.90 కోట్లు నెట్‌, రూ. 347.88 కోట్లు గ్రాస్‌ వచ్చింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసి సత్తా చాటింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

హై రేంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 15వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 15 రోజుల్లో 1.168 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 9665.20 కోట్లు వసూలు చేసి అదిరిపోయే రికార్డులు నమోదు చేసింది.

300 ఔట్.. 10000 కోట్లు దిశగా

300 ఔట్.. 10000 కోట్లు దిశగా

జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భారీ చిత్రం రూ. 300 కోట్లు నెట్‌ మార్కును చేరుకుంది. అలాగే, ఇప్పటికే రూ. 9665 కోట్లు వసూలు చేసిన ఈ హాలీవుడ్ మూవీ.. 10000 కోట్ల రూపాయల మార్కును చేరుకోబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X