Avatar 2 Collections: అక్షరాల 10000 కోట్లు ఔట్.. అవతార్ 2 బీభత్సం.. ఒక్క తెలుగులోనే అన్ని కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్‌లో తెరకెక్కే చిత్రాలకు భారీ అన్ని వర్గాల వాళ్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. అలాంటిది ఓ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి నిదర్శనంగా నిలుస్తోన్న చిత్రమే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. 2009లో వచ్చిన అవతార్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 16 రోజుల్లో ఎంత కలెక్షన్ రాబట్టిందో మీరే చూసేయండి!

విజువల్ వండర్‌గా సీక్వెల్
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తీసిన మరో భారీ చిత్రమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజైంది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన గ్రాఫిక్స్ సమాహారం 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దీంతో ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

16వ రోజు తెలుగు వసూళ్లిలా
హై టెక్నికల్ కాన్సెప్టుతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక, రెండు వారాల్లోనూ సత్తా చాటిన ఈ మూవీ.. 16వ రోజైన శనివారం కూడా బాగానే రాబట్టింది. ఫలితంగా దీనికి రూ. 2.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

16 రోజుల్లో తెలుగులో ఇలా
'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 43.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 28.68 కోట్లతో కలిపి రూ. 81.28 కోట్లు గ్రాస్ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 86.30 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 16 రోజుల్లో రూ. 36.30 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు
భారీ విజువల్స్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీగానే దక్కుతున్నాయి. ప్రతి రోజూ దీనికి సగటున రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. ఇలా 16 రోజుల్లో కూడా ఇండియా మొత్తంలో రూ. 310.40 కోట్లు నెట్, రూ. 360.88 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 16వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 80 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 16 రోజుల్లో 1.244 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 10294.10 కోట్లు వసూలు చేసి రికార్డులు నమోదు చేసింది.

10000 కోట్లు మార్క్ దాటేసి
లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10000 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. అలాగే, ఇండియాలోనూ రూ. 350 కోట్లు గ్రాస్‌ను రీచ్ అయి సతా చాటుకుంది.


Click it and Unblock the Notifications











