twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Avatar 2 Collections: అవతార్ 2 మరో రికార్డు.. ఏకంగా 12000 కోట్లు ఔట్.. తెలుగులో ఆ హీరోలతో సమానంగా!

    |

    హాలీవుడ్ నుంచి వచ్చే ఎలాంటి చిత్రానికైనా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన దక్కుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చిన 'అవతార్' అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో దీనికి సీక్వెల్ వస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే వచ్చింది.

    ఈ నేపథ్యంలోనే గత ఏడాది చివర్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' పేరిట రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 19 రోజుల్లో ఎంత కలెక్షన్ రాబట్టిందో మీరే చూడండి!

    సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లి

    సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లి

    హాలీవుడ్ ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తీసిన మరో భారీ చిత్రమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఏర్పరచుకుని ఎక్కువ లొకేషన్లలో విడుదలైంది.

    స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

    భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

    భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

    అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దీంతో ఇది కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

    19వ రోజు తెలుగు వసూళ్లిలా

    19వ రోజు తెలుగు వసూళ్లిలా

    గతంలో చూడని కొత్త టెక్నాలజీతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక, 19వ రోజైన మంగళవారం కూడా ఈ సినిమా బాగానే రాబట్టింది. ఫలితంగా దీనికి తెలుగులో రూ. 1.38 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షోజాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

    19 రోజుల్లో తెలుగులో ఇలా

    19 రోజుల్లో తెలుగులో ఇలా

    'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 45.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.36 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 31.18 కోట్లతో కలిపి రూ. 88.06 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 93.21 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 19 రోజుల్లో రూ. 43.21 కోట్లు లాభాలు సాధించింది.

    ఇండియా మొత్తం వసూళ్లు

    ఇండియా మొత్తం వసూళ్లు

    క్రేజీ ఐడియాతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీగానే దక్కుతున్నాయి. ప్రతి రోజూ దీనికి సగటున రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. దీంతో 19 రోజుల్లో కూడా ఇండియా మొత్తంలో రూ. 350.40 కోట్లు నెట్‌, రూ. 420.88 కోట్లు గ్రాస్‌‌ను వసూలు చేసింది.

    హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 19వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 40 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 19 రోజుల్లో 1.489 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 12340.31 కోట్లు వసూలు చేసి రికార్డులు సరికొత్త చరిత్ర సృష్టించింది.

    English summary
    James Cameron's Avatar: The Way of Water Movie Gets Huge Response in All Over World. This Movie Collects $1.489 billion in 19 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X