Avatar 2 Collections: 2వ రోజూ ఊచకోత.. 500 కోట్లు ఏంటి సామీ.. ఓవరాల్‌గా ఎంతో తెలిస్తే మెంటలే!

ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుంది. అందులోనూ గ్రాఫిక్స్‌తో రూపొందిన మూవీలను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తున్నారు. అలా పదమూడేళ్ల క్రితం వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమానే 'అవతార్'. ప్రపంచమే మెచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. వరల్డ్ వైడ్‌గా ఊహించని రీతిలో బజ్‌ను ఏర్పరచుకున్న ఈ మూవీకి అనుకున్నట్లుగానే రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా దీనికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 2 రోజుల కలెక్షన్లపై చూద్దాం పదండి!

 విజువల్ వండర్‌గా అవతార్ 2

విజువల్ వండర్‌గా అవతార్ 2

హాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలోనూ భారీ స్పందన దక్కుతూ ఉంటుంది. అందులోనూ విజువల్ వండర్‌గా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 600లకు పైగా థియేటర్లలో ఇది విడుదలైంది. అలాగే, ఓవరాల్‌గా 17000 లోకేషన్స్‌లో ఇది రిలీజ్ అయింది.

2వ రోజు తెలుగు వసూళ్లిలా

2వ రోజు తెలుగు వసూళ్లిలా

'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులో మొదటి రోజు కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా దీనికి ఏకంగా రూ. 13.65 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక, రెండో రోజూ దీనికి భారీగానే దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 3.45 కోట్లతో రూ. 10.85 కోట్లు గ్రాస్, రూ. 5 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

2 రోజులకూ తెలుగులో ఇలా

2 రోజులకూ తెలుగులో ఇలా

హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో భారీ స్పందన దక్కడంతో వసూళ్లు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా రెండు రోజుల్లో కలిపి దీనికి నైజాంలో రూ. 13.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 8.25 కోట్లతో రూ. 24.50 కోట్లు గ్రాస్, రూ. 13 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు

జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ. 41 కోట్లు నెట్ వసూలు అయింది. ఇక, ఇదే కంటిన్యూ చేస్తూ రెండో రోజు కూడా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఫలితంగా రెండో రోజు దీనికి రూ. 45 కోట్లు వచ్చాయి. ఇలా 2 రోజుల్లో రూ. 86 కోట్లు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా మొదటి రోజు దీనికి వరల్డ్ వైడ్‌గా 136.5 మిలియన్ డాలర్లు.. అంటే రూ. 1125.17 కోట్లు వసూలు అయ్యాయి. ఇక, రెండో రోజు మాత్రం దీనికి కాస్త తగ్గి 70 మిలియన్ డాలర్లు.. అంటే రూ. 579.13 కోట్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో 1704.31 కోట్లను ఈ చిత్రం వసూలు చేసింది.

ఫుల్ రన్‌లో అన్ని వేల కోట్లు

ఫుల్ రన్‌లో అన్ని వేల కోట్లు

క్రేజీ కాంబినేషన్‌లో వీఎఫ్ఎక్స్ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 2000 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఫుల్ రన్‌లో ఈ చిత్రం దగ్గర దగ్గరగా 10 వేల కోట్ల రూపాయలను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే ఈ చిత్రం ఎన్నో రికార్డులను నమోదు చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X