Avatar 2 Collections: అవతార్ 2 ఊరమాస్ కొట్టుడు.. 3వారాల్లో అన్ని వేల కోట్లు.. తెలుగు వసూళ్లు చూస్తే!
మిగిలిన వాటితో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. విజువల్స్, టెక్నాలజీ వంటి వాటిలో ఉన్నతంగా రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతుంటుంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో దక్కుతోన్నాయి. ఇలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' పేరిట రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 3 వారాల్లో ఇది ఎంత రాబట్టిందో మీరే చూడండి!

టెక్నికల్ వండర్‌గా అవతార్ 2
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. విజువల్ వండర్‌గా దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అంచనాలతో ఎక్కువ లొకేషన్లలో విడుదలైంది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా
సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన విజువల్ వండర్ మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దీంతో ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

21వ రోజు తెలుగు వసూళ్లిలా
సరికొత్త టెక్నాలజీతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక, 21వ రోజైన గురువారం కూడా ఈ సినిమా ఏవరేజ్‌గానే వసూలు చేసింది. ఫలితంగా దీనికి తెలుగులో రూ. 1.04 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

3 వారాల్లో తెలుగులో ఇలా
3 వారాల్లో 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 46.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 32.70 కోట్లతో కలిపి రూ. 90.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది. మొత్తం కలిపి దీనికి రూ. 95.45 కోట్లు వచ్చాయి. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 21 రోజుల్లో రూ. 45.45 కోట్లు లాభాలు సాధించింది.

ఇండియా మొత్తం వసూళ్లు
అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా వసూళ్లు భారీగానే దక్కుతున్నాయి. ప్రతి రోజూ దీనికి సగటున రూ. 20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. దీంతో 3 వారాల్లో కూడా ఇండియా మొత్తంలో రూ. 358.40 కోట్లు నెట్, రూ. 432.88 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
విజువల్ వండర్‌గా 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 19వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 40 మిలియన్ డాలర్లు పైగా వచ్చాయి. ఇలా మొత్తంగా 3 వారాల్లోనే 1.590 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 13136.81 కోట్లు వసూలు చేసి రికార్డులు సరికొత్త చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











