Avatar 2 Collections: అవతార్ 2 మరో సంచలనం.. 5 రోజుల్లోనే అన్ని వేల కోట్లు.. ఇక్కడ 200 కోట్లు ఔట్

అన్ని భాషల కంటే హాలీవుడ్‌లోనే హై రేంజ్ మూవీలు వస్తుంటాయన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో అక్కడ ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన భారీ స్థాయి చిత్రమే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. విడుదలకు ముందే వరల్డ్ వైడ్‌గా భారీ బజ్‌ను ఏర్పరచుకుని.. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే దీనికి వసూళ్ల పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 5 రోజుల రిపోర్టును చూడండి!

 భారీ బడ్జెట్‌తో వచ్చేసిందిగా

భారీ బడ్జెట్‌తో వచ్చేసిందిగా

2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్'కు సీక్వెల్‌గా రూపొందిన మూవీనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుంది.

 భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

అత్యధిక బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ అత్యధికంగా థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే దూసుకెళ్తోంది.

5వ రోజు తెలుగు వసూళ్లిలా

5వ రోజు తెలుగు వసూళ్లిలా


'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కడంతో పాటు కలెక్షన్లు వస్తున్నాయి. అయితే, 5వ రోజు దీనికి సగం మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 1.55 కోట్లతో రూ. 4.45 కోట్లు గ్రాస్, రూ. 2 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

5 రోజులకూ తెలుగులో ఇలా

5 రోజులకూ తెలుగులో ఇలా


క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో భారీ స్పందన దక్కడంతో వసూళ్లు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా 4 రోజుల్లో కలిపి దీనికి నైజాంలో రూ. 24.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.70 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 16.05 కోట్లతో కలిపి రూ. 46.70 కోట్లు గ్రాస్, రూ. 24 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు


విజువల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి తొలి రోజు రూ. 41 కోట్లు, రెండో రోజు రూ. 45 కోట్లు, మూడో రోజు రూ. 43.40 కోట్లు, నాలుగో రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు వచ్చాయి. ఇలా 5 రోజుల్లో రూ. 161.30 కోట్లు నెట్‌తో పాటు రూ. 202.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 5వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 46 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ఐదు రోజుల్లో 497.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4110.25 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

 రెండో స్థానంమే.. మరో ఘనత

రెండో స్థానంమే.. మరో ఘనత

సరికొత్త టెక్నాలజీతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఐదు రోజుల్లోనే 4 వేల కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు 'Doctor Strange in the Multiverse of Madness' మూవీ ఉంది. ఇక, అవతార్ ఇండియాలో 200 కోట్లు దాటేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X