Avatar 2 Collections: అవతార్ మాస్ కొట్టుడు.. 6 రోజుల్లోనే వేల కోట్లు.. తెలుగులో లాభం ఎన్ని కోట్లంటే!

అవతార్.. అవతార్.. అవతార్.. కొంత కాలంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు న్యూస్ ఛానెళ్లలోనూ మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. 2009లో వచ్చిన 'అవతార్' మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్‌ను ఏర్పరచుకుని.. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి వసూళ్ల పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 6 రోజుల రిపోర్టును చూడండి!

 విజువల్ వండర్‌గా సీక్వెల్

విజువల్ వండర్‌గా సీక్వెల్

జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత దృశ్యాకవ్యమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

 భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ అత్యధికంగా థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు రాబడుతోంది.

6వ రోజు తెలుగు వసూళ్లిలా

6వ రోజు తెలుగు వసూళ్లిలా

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. అయితే, 6వ రోజు దీనికి కలెక్షన్లు మరింతగా డౌన్ అయిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 1.55 కోట్లతో రూ. 3.90 కోట్లు గ్రాస్, రూ. 2 కోట్లు పైగా షేర్ వసూలు అయింది.

6 రోజులకూ తెలుగులో ఇలా

6 రోజులకూ తెలుగులో ఇలా

'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో నైజాంలో రూ. 26.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 17.60 కోట్లతో కలిపి రూ. 50.60 కోట్లు గ్రాస్, రూ. 24 కోట్లు వరకూ షేర్ వసూలు అయింది. దీంతో తెలుగులో రూ. 20 కోట్లు షేర్ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం అప్పుడే రూ. 4 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా దీనికి తొలి రోజు రూ. 41 కోట్లు, 2వ రోజు రూ. 45 కోట్లు, 3వ రోజు రూ. 43.40 కోట్లు, 4వ రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు, 6వ రోజు రూ. 18 కోట్లు వచ్చాయి. ఇలా 6 రోజుల్లో రూ. 177.50 కోట్లు నెట్‌తో పాటు రూ. 228.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 6వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా ఆరు రోజుల్లో 556.15 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4600.72 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

ఓవరాల్‌గా ఎనిమిదో స్థానం

ఓవరాల్‌గా ఎనిమిదో స్థానం

సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ ఆరు రోజుల్లోనే 4600 వేల కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఫస్ట్ ప్లేస్‌లో 'Doctor Strange in the Multiverse of Madness' మూవీ ఉంది. ఇక, అవతార్ కలెక్షన్లలో ఓవరాల్‌గా 8వ స్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X