Avatar 2 Collections: 8వ రోజూ అవతార్ ఊచకోత.. మరో 400 కోట్లతో అరాచకం.. తెలుగులో మరో 25 లక్షలు వస్తే!

సాధారణంగా హాలీవుడ్ నుంచి వచ్చే ఎలాంటి సినిమా అయినా ఇండియాలో భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలాంటిది ఓ హిట్ మూవీకి సీక్వెల్‌గా రావడంతో పాటు చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన మూవీ అయితే.. ఇంక చెప్పేదేముంది? అంతలా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికి ఉదాహరణ నిలిచిన సినిమానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటుతోన్న ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అవతార్ 2' 8 రోజుల రోజుల రిపోర్టును చూడండి!

విజువల్ వండర్‌గా అవతార్

విజువల్ వండర్‌గా అవతార్

ప్రపంచమే మెచ్చిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపకల్పనలో వచ్చిన చిత్రమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 - 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని విడుదలైంది.

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా

భారీ రిలీజ్.. బిజినెస్ కూడా


క్రేజీ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు రాబడుతూ రికార్డులు సాధిస్తోంది.

8వ రోజు తెలుగు వసూళ్లిలా

8వ రోజు తెలుగు వసూళ్లిలా

విజువల్ వండర్‌గా రూపొందిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు దక్కుతున్నాయి. అయితే, 8వ రోజు దీనికి కలెక్షన్లు మరింతగా తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 80 లక్షలతో రూ. 2.20 కోట్లు గ్రాస్, రూ. 1.20 కోట్లు షేర్ వసూలు అయింది.

8 రోజుల్లో తెలుగులో ఇలా

8 రోజుల్లో తెలుగులో ఇలా

'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో నైజాంలో రూ. 30.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.55 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 19.40 కోట్లతో కలిపి రూ. 56.00 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. దీంతో తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఇది 8 రోజుల్లోనే రూ. 9.75 కోట్లు లాభాలు అందుకుంది. మరో రూ. 25 లక్షలు వస్తే రికార్డు సాధిస్తుంది.

ఇండియా మొత్తం వసూళ్లు

ఇండియా మొత్తం వసూళ్లు


హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు రూ. 41 కోట్లు, 2వ రోజు రూ. 45 కోట్లు, 3వ రోజు రూ. 43.40 కోట్లు, 4వ రోజు రూ. 14 కోట్లు, 5వ రోజు రూ. 15 కోట్లు, 6వ రోజు రూ. 18 కోట్లు, 7వ రోజు రూ. 14 కోట్లు, 8వ రోజు రూ. 12 కోట్లు వచ్చాయి. ఇలా 8 రోజుల్లోనే ఈ మూవీకి రూ. 201.50 కోట్లు నెట్‌, రూ. 245.70 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే


జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 8వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా 52 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇలా మొత్తంగా 8 రోజుల్లో 661.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5464.27 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేసింది.

రెండో వారంలోనూ అలాగే

రెండో వారంలోనూ అలాగే


సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 609.8 మిలియన్ డార్లను వసూలు చేసింది. అలాగే, రెండో వారంలోనూ ఈ చిత్రం అదే రీతిలో వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా 8వ రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 52 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X