Avatar 2 day 1 Collections.. కలెక్షన్ల సునామీకి అవతార్ 2 సిద్దం.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న అవతార్ 2 చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఇండియాలో సినీ ప్రేక్షకుల నుంచి భారీ రెస్సాన్స్ కనిపిస్తుండటంతో తొలి వారంలోనే రికార్డులు బ్రేక్ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ క్రమంలో తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉండబోతుందంటే?

భారతీయ ప్రధాన భాషల్లో..

భారతీయ ప్రధాన భాషల్లో..

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో కేట్ విన్స్‌లెట్, విన్ డిజీల్, స్టెఫాన్ వార్తింగ్టన్, జో సల్ానా, సామ్ వర్తింగ్టన్ తదితరులు నటించారు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతున్నది.

తొలివారాంతానికి అమ్ముడైన టికెట్లు

తొలివారాంతానికి అమ్ముడైన టికెట్లు


అవతార్ 2 సినిమాకు సంబంధించిన అన్ని భాషలకు ఇండియాలో భారీ రెస్పాన్స్ ఉంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ లాంటి మల్టీ ప్లెక్స్ చైన్స్ థియేటర్లలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. శుక్రవారం నాటికి 1.4 లక్షలు టికెట్లు, శనివారం 1.05 లక్షల టికెట్లు, ఆదివారం రోజున 90 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు తొలివారాంతానికి 3.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి మూడు రోజల్లో అడ్వాన్స్ బుకింగ్

తొలి మూడు రోజల్లో అడ్వాన్స్ బుకింగ్


ఇక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. అవతార్ 2 మూవీ 3డీ వెర్షన్‌కు 5 కోట్లు, ఇంగ్లీష్ ఐమాక్స్ 3డీ 1.6 కోట్లు, ఇంగ్లీష్ 4డీఎక్స్ 3డీ వెర్షన్‌కు 66 లక్షలు, హిందీ 3డీ వెర్షన్‌కు 1.4 కోట్లు, తెలుగు 3డీ వెర్షన్‌కు 1.5 కోట్లు, తమిళ 3డీ వెర్షన్‌కు 52 లక్షలు వసూలు అయ్యాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 11 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు ఎంత వసూళ్లు చేయొచ్చంటే?

తొలి రోజు ఎంత వసూళ్లు చేయొచ్చంటే?


దేశంలో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ మినహాయిస్తే.. ఇతర మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లలో భారీగా రెస్సాన్స్ కనిపించింది. ఈ సినిమా తొలి రోజున 60 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రిలీజై.. భారీ వసూళ్లు సాధించిన స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

RRR, కేజీఎఫ్ 2పై కన్నేసిన అవతార్ 2

RRR, కేజీఎఫ్ 2పై కన్నేసిన అవతార్ 2


అవతార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్, టికెట్ల సేల్స్ చూస్తే.. ఈ చిత్రం 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజున RRR, పుష్ప, కేజీఎఫ్ 2 లాంటి సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాసే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈ రేంజ్‌లో తొలి రోజు కలెక్షన్లు వస్తాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X