Avatar 2 day 1 Collections.. కోట్లలో అడ్వాన్స్ బుకింగ్.. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల సునామీ

ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది. 2009లో రిలీజైన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకొన్నది. అయితే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్‌లో నమోదు చేసిందంటే?

అవతార్ 1 వరల్డ్ వైడ్ కలెక్షన్లు

అవతార్ 1 వరల్డ్ వైడ్ కలెక్షన్లు

అవతార్ 1 చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు, అమెరికాలో 700 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అవతార్ 2 చిత్రం ఈ వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రాన్ని నైజాంలో 240 థియేటర్లు, సీడెడ్‌లో 135 పైగా థియేటర్లు, ఆంధ్రాలో 290 పైగా థియేటర్లలో రిలీజు అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 665పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఇటీవల కాలంలో ఓ తెలుగేతర చిత్రం ఈ రేంజ్‌లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తు్నాయి.

ఇండియా వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్

ఇండియా వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్

ఇక ఇండియాలో రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 3.1 కోట్లు, బెంగళూరులో 2.9 కోట్లు, ముంబైలో 1.89 కోట్లు, ఢిల్లీలో 1.75 కోట్లు, చెన్నైలో 1.25 కోట్లు, పూణెలో 78 లక్షల రూపాయలు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 12 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది.

12 లక్షలకుపైగా టికెట్లు

12 లక్షలకుపైగా టికెట్లు

దేశవ్యాప్తంగా అవతార్ అడ్వాన్స్ బుకింగ్‌ దుమ్మురేపుతున్నది. ఈ సినిమాను దేశంలో 4490 పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. దేశంలోనే సూపర్ స్టార్‌కు సినిమాకు ఉండే రెస్పాన్స్ కంటే ఎక్కువగా అవతార్ 2కు కనిపిస్తున్నది. దాదాపు 12 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 35 శాతానికిపైగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

చైనాలో రికార్డు స్థాయిలో

చైనాలో రికార్డు స్థాయిలో


ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అవతార్ సినిమాకు అపూర్వ ఆదరణ దక్కుతున్నది. చైనాలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి వారాంతంలో 100 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వరగ్ాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తుగా టికెట్ల అమ్మకాల రూపంలో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇంకా ఈ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X