Avatar 2 First Day Collections: అనుకున్నదొక్కటి.. వచ్చింది మరొకటి.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

బిగ్గెస్ట్ హాలీవుడ్ మూవీ అవతార్ 2 కోసం సినీ లవర్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి డిసెంబర్ 16 శుక్రవారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. జేమ్స్ కెమెరున్ సృష్టించిన ఈ అద్భుత సృష్టి ప్రేక్షకుల నుంచి విభిన్నమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ సినిమా మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ మొత్తం ఎంత అనే వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ఇండియాలో కూడా గ్రాండ్ గానే విడుదల చేయడం జరిగింది. అయితే హై క్రేజ్ ఉండటం వలన సినిమాను 6000 కు పైగా థియేటర్లలో ఇండియాలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ డిమాండ్ ను బట్టి 4500 స్క్రీన్స్ లలో విడుదల చేయాల్సి వచ్చింది.

అడ్వాన్స్ బుకింగ్స్

అడ్వాన్స్ బుకింగ్స్

అవతార్ 2 సినిమాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉండడం వలన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను 600కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇక ఇండియా మొత్తంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

థియేటర్ ఆక్యుపెన్సీ

థియేటర్ ఆక్యుపెన్సీ

3D విడుదలైన ఈ సినిమాకు ఇండియన్ మొదటి రోజు మార్నింగ్ షోలకు 26.98 థియేటర్ ఆక్యుపెన్సితో కొనసాగింది. ఇక మధ్యాహ్నం నుంచి ఆక్యుపెన్సీ మరి కొంత పెరిగింది. ఈవినింగ్ నైట్ షోలకు కూడా త్రీడీలో అయితే భారీగా స్పందన పెరిగింది. ఎక్కువగా అయితే ఈ సినిమా హైదరాబాదులోనే మంచి ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. సెకండ్ షోలకు మొత్తంగా 64 శాతానికి పైగా ఆక్యుపెన్సి నమోదయింది.

సౌత్, నార్త్ కలెక్షన్స్

సౌత్, నార్త్ కలెక్షన్స్

ఇక ఈ సినిమా కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.మ్ సౌత్ అలాగే నార్త్ ఇండస్ట్రీలో దాదాపు ఒకే తరహా రేంజ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ లో అయితే 16 నుంచి 17 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక హిందీ బెల్ట్ మొత్తం చూసుకుంటే అక్కడ 18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదటి రోజు కలెక్షన్స్..

మొదటి రోజు కలెక్షన్స్..

మొత్తంగా మొదటి రోజు అయితే ఈ సినిమా తప్పకుండా 50 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో కాకుండా సినిమా మొదటి రోజు ఇండియా మొత్తంలో కూడా దాదాపుగా 35 కోట్ల నుంచి 38 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయానికి మొత్తం అఫీషియల్ బాక్సాఫీస్ నెంబర్స్ రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X