Avatar 2 World Wide collection: న్యూ ఇయర్ రోజు కూడా అవతార్ దూకుడు.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన అవతారం 2 సినిమా కలెక్షన్స్ అందుకోవడంలో రోజురోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రతి హాలిడేస్ లో కూడా మిగతా సినిమాలపై పట్టు సాధిస్తూ మంచి ప్రాఫిట్స్ అయితే అందిస్తోంది. ఇక 2023 జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ హాలిడేస్ సందర్భంగా మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా 17 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ అందుకుంది అలాగే ఇండియాలో తెలుగులో ఏ స్థాయిలో లాభాలను అందించింది.. అనే వివరాల్లోకి వెళితే..

విడుదలకు ముందే..

విడుదలకు ముందే..

టైటానిక్ దర్శకుడు జేమ్స్ కెమెరున్ 2009లో తెరపైకి తీసుకువచ్చిన అవతార్ 2 సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక విడుదల తర్వాత కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. హాలిడే సీజన్లో విడుదల కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగబడి చూశారు.

 ఇండియాలో రికార్డు స్థాయిలో..

ఇండియాలో రికార్డు స్థాయిలో..

ఇక ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమా 165 పైగా భాషల్లో విడుదల అయింది. ఇక ఈ సినిమా ఇండియాలో కూడా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో అవతార్ 2 టాప్ లిస్టులో చేరిపోయింది. ఇంతవరకు ఏ హాలీవుడ్ సినిమా ఇండియాలో అందుకొని కలెక్షన్స్ ను అవతార్ 2 సాధించింది.

ఇండియాలో 17వ రోజు కలెక్షన్స్

ఇండియాలో 17వ రోజు కలెక్షన్స్

అవతార్ 2 సినిమాకు 17వ రోజు కూడా న్యూ ఇయర్ కావడంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదట ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ రాకపోవచ్చు అనుకున్నారు. కానీ 17 రోజులు ఊహించని విధంగా 17 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే సోమవారం నుంచి కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇండియాలో టోటల్ కలెక్షన్స్

ఇండియాలో టోటల్ కలెక్షన్స్

ఇక అవతార్ 2 సినిమా ఇండియా మొత్తంలో అందుకున్న కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండియాలో ఈ సినిమా హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా అనువదమైన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం గా ఇప్పటివరకు అన్ని భాషల్లో కలుపుకుని 367.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

తెలుగులో ప్రాఫిట్స్ ఎంతంటే?

తెలుగులో ప్రాఫిట్స్ ఎంతంటే?

'అవతార్ ది వే ఆఫ్ వాటర్'కు 17 రోజుల్లో ఏపి తెలంగాణలో వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 45.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.02 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏరియాలు కలిపి రూ. 29.61 కోట్లతో కలిపి రూ. 85.03 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది. మొత్తం ఏపీ తెలంగాణలో రూ. 85.03 కోట్లు వచ్చాయి. ఇక తెలుగులో రూ. 50 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా 17 రోజుల్లో రూ. 40.30 కోట్లు లాభాలు అందించింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

అవతార్ ది వే ఆఫ్ వాటర్.. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 1.306 బిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పటివరకు ఈ సినిమా 10807 కోట్ల రూపాయల వసూళ్లను అందుకొని అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X