Avatar 2 Telugu Bussiness: ఈసారి తెలుగులో హై డిమాండ్.. కళ్ళు చెదిరే బిజినెస్!
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో గుర్తింపు అందుకున్న సినిమాలలో అవతార్ ఒకటి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుతాన్ని ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అని చెప్పవచ్చు. ఇక ఆ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 13 ఏళ్లు కవస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేయనుంది అనే వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ రిలీజ్
ఇక సీక్వెల్ ను గత రెండు మూడేళ్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జేమ్స్ కెమెరన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మొత్తానికి సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ఉండే విజువల్స్ హై ఎమోషన్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

హై విజువల్ గ్రాఫిక్స్
'అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్' అనె కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరు చూపించని హై విజువల్ గ్రాఫిక్స్ ను చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఊహించని రేంజ్ లోనే
అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లోనే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఇండియాలో కూడా అవతార్ కు అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ సినిమాను త్రీడీలో హైటెక్నాలజీతోనే విడుదల చేయబోతున్న విషయం తెలిసింది. ఇక తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ధియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులు దాదాపు 100 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా వివిధ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇక తెలుగులో కూడా భారీగానే విడుదల చేస్తారు కాబట్టి దాదాపు 100 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం ఉందట. అంతకంటే ఎక్కువ స్థాయిలోనే రేటు పలికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇండియా బిజినెస్
అయితే ఒక డిస్ట్రిబ్యూటర్ కాకుండా ఈ సినిమా హక్కులను కొంతమంది నిర్మాతలు కలిసి కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమాకు హై రేంజ్ లోనే ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి డిమాండ్ ను బట్టి ఈ సినిమా హక్కుల అమ్ముడు పోయే అవకాశం ఉంది. ఇక తమిళనాడు కేరళలో కూడా మంచి డిమాండ్ ఉండడంతో అక్కడ 50 కోట్లకు అమ్ముడయ్య చాన్స్ ఉంది. ఇండియా మొత్తంలో ఈ సినిమా దాదాపు 200 కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా కూడా ఈ రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది లేదు.

ఆ రికార్డును బ్రేక్ చేసేలా..
ఇక అవతార్ సినిమా ఇండియన్ మార్కెట్లో అయితే ఈజీగా 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందుకు విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ 30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అందుకోగా ది స్పైడర్ మాన్ నో వే హోమ్ 33 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. మరి ఈ హాలీవుడ్ సినిమాల రికార్డును ఇండియాలో అవతార్ 2 ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











