Avatar 3 Day 1 Box Office: అవతార్ 2 మూవీకి 18630 కోట్ల కలెక్షన్లు.. అవతార్ 3 ఎన్ని కోట్లంటే?
ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.
అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.400 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయి? అవతార్ 2 చిత్రం ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా విషయానికి వస్తే.. అవతార్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా కోసం కొత్త తెగను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఈ మూవీ కోసం ఊహకు అందని విధంగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సి రావడంతో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌ను చేశారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18630 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం 5480 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియా, అమెరికేతర దేశాల్లలో ఈ చిత్రం 13155 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 454 కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్హం.
అయితే అవతార్ 3 సినిమా తొలి వారాంతం కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఐమాక్స్ వెర్షన్ స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్‌గా మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం తొలి వారాంతం అంటే మూడు రోజులకు గాను 110 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. ఇండియాలో తొలి రోజు 35 నుంచి 40 కోట్ల రూపాయలు రాబట్టవచ్చు. తొలి వారాంతానికి వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్ డాలర్ల నుంచి 200 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1800 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. అవతార్ 2 సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను సులభంగా అధిగమిస్తుంది. జేమ్స్ కామెరాన్ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లను సాధించే చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











