Avatar: Fire And Ash Day 1 Box Office: అవతార్ 3 కలెక్షన్లు ఎన్ని కోట్లు? దురంధర్‌ను బీట్ చేస్తుందా?
ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.
అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇండియాలో ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయి? అవతార్ 2 చిత్రం ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా విషయానికి వస్తే.. అవతార్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా కోసం కొత్త తెగను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఈ మూవీ కోసం ఊహకు అందని విధంగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సి రావడంతో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌ను చేశారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
ఇండియాలో ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళితో జేమ్స్ కామెరాన్ జరిపిన సంభాషణ భారీగా హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి జక్కన్న చెప్పిన విషయాలు ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమాకు ఉన్నట్టుండి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పీవీఆర్ ఐనాక్స్, సిని పోలీస్ లాంటి నేషనల్ చైన్ థియేటర్లలో 150K టికెట్స్ అమ్ముడుపోయాయి. దాంతో తొలి రోజు భారీగా వసూళ్లు నమోదు అవుతాయని అంచనా వస్తున్నారు.
ఇదిలా ఉండగా, అవతార్ 2 అంటే అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇండియాలో మొదటి రోజున 40 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను మించి అవతార్ 3 సాధిస్తుందా? అనే చర్చ భారీగా జరుగుతున్నది. ఇక అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం ఈ మూవీ 25 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తుంది. కరెంట్ బుకింగ్‌కు రెస్పాన్స్ భారీగా ఉంటే.. ఈ సినిమా అవతార్ 2 కలెక్షన్లను మించి వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ షో తర్వాత వచ్చే టాక్‌ను బట్టి తొలి రోజు కలెక్షన్లు ఏం రేంజ్‌లో ఉంటాయనేది డిసైడ్ అవుతాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అవతార్ 2 చిత్రం ఇండియాలో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం టోటల్ రన్‌లో 390 కోట్ల రూపాయలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. అవతార్ 3 ఈ రికార్డును అధిగమిస్తుందా? లేదా అనే విషయంపైట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి. అలాగే దురంధర్ మూవీ కలెక్షన్లను అధిగమిస్తుందా? అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











