Avatar: Fire And Ash Day 1 Collection: అవతార్ 3కి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే? ఇండియాలో తొలి రోజు ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లి, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించిన అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా గతంలో అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైట్‌స్ట్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌలు సంయుక్తంగా నిర్మించారు. సామ్ వార్తింగ్టన్, జో సాల్దానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జోయెల్ డేవిడ్ మూరే, బ్రెండన్ కోవెల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమందా సిల్వర్‌లు స్క్రీన్ ప్లే, స్టోరీని అందించారు. ఈ చిత్రానికి రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. స్టీఫెన్ ఈ రిక్విన్, డేవిడ్ బ్రెన్నెర్, నోకోలస్ డీ టోత్, జాన్ రిఫోవా, జాన్ గౌడియో, జేమ్స్ కామెరాన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సిమోన్ ఫ్రాంగ్లెన్ సంగీత దర్శకత్వం వహించారు. అవతార్ 3 బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? భారత్‌లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

అవతార్ 3 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం అవతార్ 3కి భారీగా ఖర్చు పెట్టారు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 3300 కోట్ల రూపాయలు) బడ్జెట్ అయ్యింది.
అవతార్ 3 కలెక్షన్స్
అవతార్ 3 సినిమాకు గురువారం ప్రీమియర్స్‌తో 12 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు 12 కోట్ల రూపాయలు) రాబట్టింది. తాజా అంచనాల ప్రకారం అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 340 నుంచి 380 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 3195 కోట్ల రూపాయలు) రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇందులో 250 నుంచి 275 మిలియన్ డాలర్లు (2300 కోట్ల రూపాయలు) అమెరికాకు వెలుపల ఓవర్సీస్ మార్కెట్ నుంచి వస్తాయని భావిస్తున్నారు.
నార్త్ అమెరికాలో ఎన్ని కోట్లంటే?
నార్త్ అమెరికాలోని అమెరికా, కెనడాలలో ఫస్ట్ వీకెండ్‌లో అవతార్ 3 90 నుంచి 105 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 840 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 380 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్‌తో అవతార్ 3 ఘనంగా ప్రారంభించి.. కోవిడ్ తర్వాత అత్యంత భారీ ఓపెనింగ్స్‌ను అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచినప్పటికీ అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ కంటే వసూళ్లు తగ్గుతాయని భావిస్తున్నారు. అవతార్ 2 తొలిరోజున ఏకంగా 441.6 మిలియన్ డాలర్లు ( 3978 కోట్ల రూపాయలు) వసూలు చేసింది.
ఇండియాలో అవతార్ 3 కలెక్షన్స్
భారతదేశంలో అవతార్ 3కి మధ్యాహ్నం 3 గంటల వరకు ఐ మ్యాక్స్ 3డీ వెర్షన్- ఇంగ్లీష్‌లో 54 శాతం... ఐ మ్యాక్స్ 3డీ వెర్షన్- హిందీలో 66 శాతం... డాల్బీ సినీ ఇంగ్లీష్ వెర్షన్‌లో 34 శాతం... హిందీ 4డీఎక్స్ 3డీలో 84 శాతం.. ఇంగ్లీష్ 4డీఎక్స్ 3డీలో 60 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి ఇండియాలో 5.53 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉండటంతో అవతార్ 3కి ఇండియాలో ఫస్ట్ డే 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవతార్ ఎలాంటి మేజిక్ చూస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











