Avatar: Fire And Ash Day 2 Collection: 2000 కోట్లపై అవతార్ గురి.. 2వ రోజు ఇండియాలో ఎన్ని కోట్లంటే?
జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా విడుదలైంది అవతార్ 3: ఫైర్ అండ్ యాష్. సినీ ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లైట్‌స్ట్రోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్, జాన్ లాండౌలు సంయుక్తంగా నిర్మించారు. సామ్ వార్తింగ్టన్, జో సాల్దానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టీస్, జోయెల్ డేవిడ్ మూరే, బ్రెండన్ కోవెల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మూవీకి జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమందా సిల్వర్‌లు స్క్రీన్ ప్లే, స్టోరీని అందించారు. ఈ చిత్రానికి రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. స్టీఫెన్ ఈ రిక్విన్, డేవిడ్ బ్రెన్నెర్, నోకోలస్ డీ టోత్, జాన్ రిఫోవా, జాన్ గౌడియో, జేమ్స్ కామెరాన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సిమోన్ ఫ్రాంగ్లెన్ సంగీత దర్శకత్వం వహించారు. అవతార్ 3 బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? భారత్‌లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

అవతార్ 3 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం అవతార్ 3కి భారీగా ఖర్చు పెట్టారు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు 400 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 3300 కోట్ల రూపాయలు) బడ్జెట్ అయ్యింది.
అవతార్ 3 తొలి రోజు కలెక్షన్స్
అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 537 కోట్ల రూపాయలు) ఓపెనింగ్స్ వసూలు చేసింది. చైనాలో 17.1 మిలియన్ డాలర్లు (152 కోట్ల రూపాయలు) రాబట్టింది. అమెరికా, కెనడాలలో ప్రివ్యూలలో 12 మిలియన్లు (107 కోట్ల రూపాయలు) వసూలు చేయగా.. తొలి రోజున 37 మిలియన్ డాలర్లు (331 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
భారత్‌లో అవతార్ కలెక్షన్స్
అవతార్ 3కి భారతదేశంలో తొలి రోజున 20 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంగ్లీష్‌లో 8.5 కోట్ల రూపాయలు, హిందీలో 5.25 కోట్ల రూపాయలు, తెలుగులో 2.75 కోట్ల రూపాయలు, తమిళంలో 2.43 కోట్ల రూపాయలు, కన్నడంలో 5 లక్షల రూపాయలు, మలయాళంలో 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. దురంధర్ సినిమా కారణంగా అవతార్ 3 ఓపెనింగ్స్‌కు గట్టి దెబ్బ పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అవతార్ 2 తొలి రోజున ఇండియాలో 41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రికార్డును అవతార్ 3 బ్రేక్ చేయలేకపోయింది.
అవతార్ 3 రెండో రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో అవతార్ 3కి శనివారం మంచి కలెక్షన్స్ వసూలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండో రోజు అవతార్ 3కి నార్త్ అమెరికాలో 45 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 403 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇతరదేశాలలో అవతార్ 3కి రెండో రోజు 85 మిలియన్ డాలర్లు (761 కోట్ల రూపాయలు) రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో వరల్డ్ వైడ్‌గా రెండో రోజు అవతార్ 3కి 130 మిలియన్ డాలర్లు (1164 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని భావిస్తున్నారు. దాంతో కలిపి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 190 మిలియన్ డాలర్లు (1700 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ ముగిసే నాటికి 2000 కోట్ల క్లబ్‌లో తమ చిత్రం చేరుతుందని అవతార్ 3 యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇండియాలో అవతార్ 3 రెండో రోజు వసూళ్లు
వీకెండ్ కావడంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి అవతార్ 3కి శనివారం మనదేశంలో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. దాంతో రెండో రోజు ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో అవతార్ 3 భారతదేశంలో 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











