Avatar 3 Day 4 Box Office: 3 రోజుల్లో 3100 కోట్ల కలెక్షన్లు.. అవతార్ 3 4వ రోజు ఎన్ని కోట్లంటే?

ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.

అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇండియాలో ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయి? అవతార్ 2 చిత్రం ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

Avatar Fire And Ash Day 4 Expected Box Office

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా విషయానికి వస్తే.. అవతార్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా కోసం కొత్త తెగను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఈ మూవీ కోసం ఊహకు అందని విధంగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సి రావడంతో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌ను చేశారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

ఇండియాలో అవతార్ 3 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజున 19 కోట్ల రూపాయలు, రెండో రోజు 22.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 25.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 67 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఇక 4వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ సినిమా మరో 12 కోట్ల నుంచి 15 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా దేశంలోని వివిధ భాషల్లో రాబట్టిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇంగ్లీష్ వెర్షన్ సుమారుగా 30 కోట్ల రూపాయలకుపైగా, హిందీ వెర్షన్ 22 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 8 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 9 కోట్ల రూపాయలు, కన్నడలో 6 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అవతార్ 3 చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 68 కోట్ల రూపాయలకుపైగా నెట్, 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక నార్త్ అమెరికాలో 800 కోట్ల రూపాయలు, ఇతర దేశాల్లో ఈ సినిమా 2300 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 3100 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసి రికార్డు దిశగా దూసుకెళ్తున్నది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X