Avatar 3 Business: సినిమా చరిత్రలోనే అవతార్ 3 రికార్డు బిజినెస్.. జేమ్స్ కామెరాన్‌కు ఎన్ని వేల కోట్లంటే?
ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మించారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటించారు.
అవతార్ 3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? అన్ని విభాగాల్లో జరిగిన బిజినెస్ వివరాల్లోకి వెళితే..

అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా విషయానికి వస్తే.. అవతార్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం. ఈ సినిమా కోసం కొత్త తెగను జేమ్స్ కామెరాన్ సృష్టించారు. ఈ మూవీ కోసం ఊహకు అందని విధంగా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాల్సి రావడంతో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌ను చేశారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 400 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా హక్కులకు డిమాండ్ భారీగా ఉండటంతో పోటీపడి హాట్ కేకుల్లా కొనుగోలు చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అవతార్ 1, అవతార్ 2 సినిమాల కంటే అధికంగా ఈ మూవీ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం.
అవతార్ 3 సినిమా ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా హక్కులను డిస్నీ+ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నది. సినిమా హిస్టరీలోనే అత్యధిక మొత్తంలో డీల్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సుమారుగా 2900 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాల్లో టాక్ కొనసాగుతున్నది.
జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటు పలికాయి. ఈ సినిమాను సుమారుగా 1500 కోట్ల రూపాయలకు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ హక్కులను కూడా డిస్నీ నెట్‌వర్క్ సొంతం చేసుకొన్నది. ఇదిలా ఉండగా ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ సుమారుగా 350 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని తెలిసింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా జేమ్స్ కామెరాన్ భారీగా రెవెన్యూ సొంతం చేసుకొన్నారు. ఈ సినిమాకు సుమారుగా 4750 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా తన ఖాతాలో వేసుకొన్నారు. ఇవే కాకుండా థియేట్రికల్ రైట్స్ ద్వారా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసి భారీ మొత్తాన్ని సొంతం చేసుకొన్నాడనే విషయం ట్రేడ్ వర్గాలు గొప్పగా చెప్పుకొంటున్నాయి.


Click it and Unblock the Notifications











