Avatar 2 Collections బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన జేమ్స్ కామెరాన్.. అవతార్ 2 కలెక్షన్లు ఎంతంటే?
సినిమా రంగంలో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ మరో ఘనతను సాధించాడు. తాను రూపొందించిన సినిమాల్లో మూడో చిత్రాలను 2 బిలియన్ డాలర్లు క్లబ్‌లోకి చేర్చిన రికార్డును అవతార్ 2 సినిమాతో జేమ్స్ సొంతం చేసుకొన్నారు. గతంలో తాను నిర్మించి, దర్శకత్వం వహించిన అవతార్, అలాగే టైటానిక్ చిత్రాలు కూడా ఈ ఘనతను సాధించాయి. అవతార్ 2 సినిమా తాజా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అవతార్ టాప్ నంబర్ 1 స్థానంలో
జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును అందుకొన్నది. 2009 నుంచి ఇప్పటి వరకు 2.92 బిలియన్ డాలర్లను రాబట్టింది. అప్పటి నుంచి ఈ సినిమా కలెక్షన్ల రికార్డును అధిగమించాలని ఎన్నో చిత్రాలు, ఎంతో మంది దర్శకులు ప్రయత్నించినా.. అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

అవెంజర్స్: ఎండ్ గేమ్ కలెక్షన్లు
హాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రిలీజైన అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓ దశలో అవతార్ సినిమా కలెక్షన్లను దాటేస్తుందని అందరూ భావించారు. కానీ అవెంజర్స్: ఎండ్ గేమ్ మాత్రం 2.7 బిలియన్ డాలర్ల వద్ద బాక్సాఫీస్ జర్నీని ఆపేసింది. దాంతో అవతార్ సినిమా కలెక్షన్లు పదిలంగా ఉండిపోయాయి.

ఇండియాలో అవతార్ 2 ఆరు భాషల్లో
హాలీవుడ్ నటులు సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ లాంటి అగ్రతారలు నటించిన అవతార్ 2 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలోనే ఆరు భాషల్లో అంటే.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కింది. ఇండియాలో 473 కోట్లకుపైగా గ్రాస్, 391 కోట్ల షేర్ నమోదు చేసింది.

చైనాలో రికార్డులు తిరగరాసిన అవతార్2
అలాగే అవతార్ చిత్రం చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. చైనాలో భారీ వసూళ్లు సాధించిన 10 హాలీవుడ్ చిత్రంగా రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం చైనాలో 241 అమెరికన్ డాలర్లు అంటే.. 1000 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూల్లను సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా అవతార్2 చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. టైటానిక్ రికార్డును అధిగమించింది. టైటానిక్ చిత్రం 2.2428 బిలియన్ డాలర్లు వసూలు చేయగా.. అవతార్ 2 మాత్రం ఇటీవల ఆ రికార్డును అధిగమించింది. అవతార్ 2 చిత్రం 2.2433 బిలియన్ డాలర్లు అంటే.. 15800 కోట్లకుపైగా రూపాయలను వసూలు చేసింది.

ప్రపంచంలోనే మూడోస్థానంలో అవతార్ 2
అవతార్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా చరిత్రను సృష్టించింది. అవతార చిత్రం 2.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో, అవెంజర్స్: ఎండ్ గేమ్ 2.7 బిలియన్ డాలర్ల రెండో స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో అవతార్ 2 చిత్రం టాప్ స్థానానికి చేరుకొంటుందా లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











