Avatar 2 day 1 Advance booking.. రిలీజ్‌కు ముందే కోట్ల రూపాయల కుంభవృష్టి.. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే?
ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 ఫీవర్ మొదలైంది. ఇండియాలో అవతార్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై క్రేజ్ భారీగా ఉండటంతో గత కొద్ది రోజుల నుంచే భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. తొలి రోజు తొలి ఆట చూసేందుకు అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఆన్‌లైన్ బుకింగ్‌లో కనిపిస్తున్నది. అయితే తొలి రోజు అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్‌లో జరిగిందంటే?

అవతార్ 100 కోట్ల కలెక్షన్లు
2009లో రికార్డు వసూళ్లును సాధించిన అవతార్ సినిమాకు సీక్వెల్‌గా అవతార్ 2 రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా 2009లో 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇటీవల అవతార్ సినిమా రీ రిలీజ్ కూడా భారీ వసూళ్లను సాధించింది. అవతార్ సృష్టించిన ప్రభావంతో అవతార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దేశవ్యాప్తంగా రికార్డు అడ్వాన్స్ బుకింగ్
తాజా సమాచారం ప్రకారం ఇండియాలో అవతార్ 2 చిత్రానికి సంబంధించి ఇంగ్లీష్ 3డీ వెర్షన్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ఇప్పటి వరకు 50363 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఐమాక్స్ వెర్షన్ 3డీ చిత్రానికి 10643 టికెట్లు, అవతార్ 4డీఎక్స్ 3డీ 4708 టికెట్లు, హిందీ వెర్షన్ 6526 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియా వ్యాప్తంగా మొత్తం 72240 టికెట్లు అమ్ముడుపోయాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశంలోని ప్రధాన నగరాల్లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో అత్యధికంగా 70 లక్షల రూపాయలు, బెంగళూరులో 43 లక్షలు, చెన్నైలో 34 లక్షలు, ముంబైలో 32 లక్షలు, ఢిల్లీలో 16 లక్షలు, పూణేలో 10 లక్షల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్ ఎన్ని కోట్లంటే?
ఇక అవతార్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ 3డీ వెర్షన్ 1.6 కోట్లు, ఐమాక్స్ 3డీ వెర్షన్ 1.01 కోట్లు, 4డీఎక్స్ 3డీ వెర్షన్ 41 లక్షలు, హిందీ 3డీ వెర్షన్ 21 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 3.29 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?
జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇండియాలో బ్రేక్ ఈవెన్ సాధించాంలంటే.. కనీసం 2 బిలియన్ డాలర్లు అంటే.. 200 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











