twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవతార్ రికార్డు బ్రేక్... భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న అవెంజర్స్: ఎండ్‌గేమ్

    |

    ప్రపంచ సినిమా చరిత్రను అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా తిరగరాసే దిశగా అడుగులేస్తున్నది. అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు అవతార్ పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా తుడిపి వేసింది. విడుదలైన తొలి రోజు నుంచే అవెంజర్స్ చిత్రం దాదాపు 42కుపైగా దేశాల్లో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు నెంబర్ వన్‌గా ఉన్న అవతార్‌ను కూడా దాటేయడం ట్రేడ్ వర్గాలను మరోసారి షాక్ గురిచేసింది. ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

    అమెరికాలో అత్యధికంగా

    అమెరికాలో అత్యధికంగా

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చివరి, 22వ సీక్వెల్‌పై రిలీజ్‌కు ముందే భారీగా అంచనాలు పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అమెరికా మార్కెట్‌లో అవెంజర్స్: ది ఎండ్‌గేమ్ సినిమా వసూళ్ల సునామీని కురిపించింది. ప్రస్తుతం 770.8 మిలియన్ డాలర్లు అంటే రూ.5366 కోట్ల మేర వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రమనే ఘనతను సాధించింది.

     అమెరికాలోనే రూ.5294 కోట్లు

    అమెరికాలోనే రూ.5294 కోట్లు

    గత కొన్నేళ్లుగా దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ చిత్రం నెంబర్‌వన్‌గా ఉండేది. ఈ చిత్రం అప్పట్లో 760.5 మిలియన్ల డాలర్లు అంటే 5294 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఆ వసూళ్లను అవెంజర్స్: ఎండ్‌గేమ్ అధిగమించింది. ఇంకా నిలకడగా వసూళ్లు సాధిస్తూ ఈ చిత్రం దూసుకెళ్తున్నది.

    ఇప్పటివరకు యూఎస్‌లో టాప్

    ఇప్పటివరకు యూఎస్‌లో టాప్

    ఇప్పటి వరకు అమెరికాలో అత్యధిక వసూల్లు సాధించిన టాప్ ఐదు చిత్రాలు ఇవే. అవతార్ 760.5 మిలియన్ డాలర్లు, టైటానిక్ 659.4 మిలియన్ డాలర్లు, స్టార్ వార్స్ 936.7 మిలియన్ డాలర్లు, అవెంజర్స్: ఇన్ఫినిటివార్ 678.8 మిలియన్ డాలర్లు, జురాసిక్ వరల్డ్ 652.3 మిలియన్ డాలర్ల మేరకు వసూల్లు సాధించాయి.

     ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా

    ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా

    ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అవతార్. ఈ చిత్రం 278 కోట్ల ($2,787,965,087) డాలర్లు అంటే 1 లక్ష 94 వేల కోట్లు వసూలు చేసింది. అప్పట్లో భారత్‌లోనే ఈ చిత్రం రూ.200 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో టైటానిక్ 218 కోట్ల డాలర్లు ($2,187,463,944) అంటే లక్షా 52 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వసూళ్లను అవెంజర్స్: ఎండ్‌గేమ్ అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల అంచనా.

    46 దేశాల్లో వసూళ్ల హంగామా

    46 దేశాల్లో వసూళ్ల హంగామా

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించిన చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.

    English summary
    Avengers Endgame collections, Baahubali 2 Collections, Avatar Collections, Titanic collections, Avengers Endgame Advance Booking, Avengers Endgame release date, Avengers Endgame movie news, Chris Evans movie news, Captain Marvel news, Scarlett Johansson news, అవెంజర్స్: ఎండ్ గేమ్, క్రిస్ ఎవాన్స్, కెప్టెన్ మార్వెల్, స్కార్లెట్ జాన్సన్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X