twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    19 వేల కోట్లతో సంచలనం.... అవతార్ రికార్డ్ బద్దలు!

    |

    ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం 2009లో వచ్చిన అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కొట్టాలని గత పదేళ్లుగా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు మార్వెల్ సంస్థ రూపొందించిన 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఈ ఫీట్ సాధించబోతోంది. ఈ విషయాన్ని మార్వెల్ బాస్ కెవిన్ ఫీజ్ అధికారికంగా వెల్లడించారు.

    అవతార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.78 బిలియన్ డాలర్లు(రూ. 19,210 కోట్లు) వసూలు చేసింది. ఈ రికార్డును ఈ వారం వసూళ్లతో 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' అధిగమించబతోంది. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం మరో 5 లక్షల డాలర్లు(రూ. 3.44 కోట్లు) వసూలు చేస్తే 'ది ఎండ్ గేమ్' నెం.1 స్థానంలోకి వెళ్లనుంది. తమ సినిమాకు ఇంతటి ఘన విజయం అందించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవెంజర్స్ అభిమానులకు కెవిన్ ఫీజ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

    రీ రిలీజ్ తర్వాత పెరిగిన కలెక్షన్

    రీ రిలీజ్ తర్వాత పెరిగిన కలెక్షన్

    ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' చిత్రంలో డిలీట్ చేసిన హల్క్ సీన్లతో పాటు మరికొన్ని సీక్వెన్స్ కలిపి జూన్ 28న రీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి వసూళ్లు ఊపందుకున్నాయి. సినిమాను మళ్లీ రిలీజ్ చేయడం వల్లనే ఈ రికార్డు సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు.

    ఈ సంతోషం ఎంత కాలం ఉండకపోవచ్చు

    ఈ సంతోషం ఎంత కాలం ఉండకపోవచ్చు

    అయితే త్వరలో జేమ్స్ కామెరూన్ అవతార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17, 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్- ది ఎండ్ గేమ్' మూవీ రికార్డ్ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఈ మూవీ ఈజీగా అవెంజర్స్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.

    భారీ అంచనాలతో రాబోతున్న అవతార్ 2

    భారీ అంచనాలతో రాబోతున్న అవతార్ 2

    టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలతో జేమ్స్ కామెరూన్ ప్రపంచ వ్యాప్తంగా తన సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేలా చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వస్తున్న ‘అవతార్ 2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

    భారీ బడ్జెట్

    భారీ బడ్జెట్

    అవతార్ 2 చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. $450 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అవతార్ చిత్రాన్ని మించిన రికార్డులు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Avengers: Endgame crossed Avatar's 2.78 billion dollars global box office collection this weekend to become the biggest film of all time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X