‘అవెంజర్స్’ వసూళ్ల సునామీ.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. తొలిరోజే 1800 కోట్లు!

Recommended Video

Avengers: Endgame Movie Breaks Bahubali 2 Records || Filmibeat Telugu

ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా తొలి ఆట నుంచే రికార్డుల తుప్పు వదిలిస్తున్నది. ఇప్పటి వరకు పలు చిత్రాల పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ సంచలనాలు నమోదు చేస్తున్నది. అవెంజర్స్: ఎండ్‌గేమ్ థియేటర్లలో కలెక్షన్ల మ్యాజిక్ చేస్తుంటే ట్రేడ్ అనలిస్టులు ఎంత వసూలు చేసిందనే లెక్కలు కడుతున్నారు. కేవలం యూఎస్, ఇతర ప్రాంతాల్లోనే కాకుండా చైనా, భారత్‌లో ఈ సినిమా సంచలన గణాంకాలు నమోదు చేస్తున్నది. వివరాల్లోకి వెళితే...

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్లు

ఫోర్బ్స్ అందించి నివేదిక ప్రకారం.. అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం తొలిరోజున రూ.1403 కోట్లు (216.6 మిలియన్ డాలర్లు) వసూలు చేస్తుందని అంచనా వేసింది. అలాగే సీఎన్ఎన్ అంచనా ప్రకారం.. రూ.1823 కోట్లు (260 మిలియన్ డాలర్లు), ఇతర ట్రేడ్ అనలిస్టుల ప్రకారం.. రూ.2104 (300 మిలియన్ డాలర్లు ) వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

చైనాలో వసూళ్ల వర్షంతో

చైనాలో వసూళ్ల వర్షంతో

చైనాలో అడ్వాన్సు బుకింగ్‌కు సంబంధించి అవెంజర్స్ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజున దాదాపు 107.2 మిలియన్ డాలర్ల మేర వసూలు చేసినట్టు వాల్ట్ డిస్నీ కంపెనీ డిస్టిబ్యూటర్ వెల్లడించారు. ఈ సినిమా రూపాయల్లో లెక్కిస్తే సుమారు 750 కోట్లు తొలిరోజున వసూలు చేసినట్టు వెల్లడిస్తున్నారు.

బాహుబలి2 రికార్డు బ్రేక్

బాహుబలి2 రికార్డు బ్రేక్

ఇండియాలో అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం బాహుబలి2, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, టైగర్ జిందా హై, సుల్తాన్ తొలి రోజు రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో అరుదైన రికార్డు.

ఇండియాలో టాప్ 10 రికార్డులు

ఇండియాలో టాప్ 10 రికార్డులు

ఇప్పటి వరకు భారత్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితా ఇది.
1. బాహుబలి: ది కన్ క్లూజన్: రూ. 37.53 కోట్లు
2. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ రూ.29.14 కోట్లు
3. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూ.26.27 కోట్లు
4. టైగర్ జిందా హై రూ.24.76 కోట్లు
5. సుల్తాన్ రూ.21.53 కోట్లు
6. సంజూ రూ.20.35
7. రేస్ 3 రూ.19.16 కోట్లు
8. దంగల్ రూ.18.84 కోట్లు
9. ప్రేమ్ రతన్ ధన్ పాయో రూ.15.73 కోట్లు
10. ధూమ్ 3 రూ.15.18 కోట్లు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X