చైనాలో అవెంజర్స్ ప్రభంజనం.. తొలిరోజే చైనాలో 750 కోట్ల అంచనా వసూళ్లు
మార్వెల్ సూపర్ హీరో మూవీ అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నది. చైనాలో అడ్వాన్సు బుకింగ్‌కు సంబంధించి ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజున దాదాపు 107.2 మిలియన్ డాలర్ల మేర వసూలు చేసినట్టు వాల్ట్ డిస్నీ కంపెనీ డిస్టిబ్యూటర్ వెల్లడించారు. ఈ సినిమా రూపాయల్లో లెక్కిస్తే సుమారు 750 కోట్లు తొలిరోజున వసూలు చేసే అవకాశం ఉంది.
మార్వెల్ సీక్వెల్స్‌లో ఇది 22వ చిత్రం. ఈ చిత్రంలో ఐరన్ మ్యాన్, థోర్, బ్లాక్ విండో క్యారెక్టర్లు కనిపిస్తాయి. ప్రీమియర్ల తర్వాత ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ప్రపంచంలోనే టాప్ రివ్యూ వెబ్‌సైట్ రాటెన్ టమాటోస్ ఈ చిత్రానికి 97 శాతం రేటింగ్ ఇవ్వడం విశేషం.

అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అవెంజర్స్: ఎండ్ గేమ్‌పై భారీ అంచనాలు పెరిగాయి. సర్వైవర్స్... సూపర్ విలన్ థానోస్ ఆటకట్టించడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఇప్పటికే భారతీయ ప్రేక్షకులను ఈ సినిమా ఫీవర్ పట్టుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











