twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్స్ రికార్డుల ప్రభంజనం.. బ్రిటన్, చైనాలో సునామీ.. ‘బాహుబలి’, ‘థగ్స్’ తుక్కుతుక్కు

    |

    ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను అబ్బుర పరుస్తున్నాయి. ఈ సినిమా వసూళ్ల దెబ్బకు దేశీయ, విదేశీ బాక్సాఫీస్ రికార్డులు ధ్వంసం అవుతున్నాయి. ఊహాకు అందని విధంగా వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్: ఎండ్‌గేమ్ మ్యాజిక్ చేస్తున్నది. ఈ సినిమా వసూళ్ల వివరంగా..

    తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా

    తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అవెంజర్స్ చిత్రం రూ.1186 కోట్లు వసూలు చేసింది. గురువారం ప్రదర్శించిన ప్రివ్యూల ద్వారా ఈ సినిమా రూ.419 కోట్లు రాబట్టింది. 2015లో స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ సాధించిన రూ.398 రికార్డును అవెంజెర్స్: ఎండ్ గేమ్ బ్రేక్ చేసింది. ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.

    రెండోరోజు కూడా రికార్డులపై గురి

    రెండోరోజు కూడా రికార్డులపై గురి

    ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం మరో రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. రెండురోజుల్లో రూ.2130 కోట్లు వసూళ్లను అధిగమించిన చిత్రంగా మరో ఘనతను సాధించడానికి సిద్ధమైంది. మార్వెల్ సీక్వెల్స్‌లో ఇది చిట్టచివరి చిత్రం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పొటేత్తుతున్నారు.

    బ్రిటన్‌లో కలెక్షన్ల హంగామా

    బ్రిటన్‌లో కలెక్షన్ల హంగామా

    ప్రస్తుతం అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం 46 దేశాల్లో రిలీజ్ కాబోతున్నది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న 22వ, చిట్టచివరి చిత్రం కావడంతో భారీగా ఆసక్తి పెరిగింది. బ్రిటన్‌లో ఇన్ఫినిటీ వార్‌ రికార్డును బ్రేక్ చేస్తూ గురువారం ఈ చిత్రం 104 కోట్లు ప్రివ్యూల ద్వారా వసూలు చేసింది.

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్అవెంజర్స్: ఎండ్‌గేమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

     చైనాలో బాక్సాఫీస్ షేక్ చేస్తూ

    చైనాలో బాక్సాఫీస్ షేక్ చేస్తూ

    ఇంటర్నేషనల్ సినిమా మార్కెట్‌కు చైనా అతిపెద్ద అడ్డా. తొలిరోజు వసూళ్లలో రూ.1075 కోట్లు కలెక్ట్ చేసిన రికార్డు ఉంది. తాజాగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం తొలిరోజు రూ.747 కోట్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో అవెంజర్స్: ఎండ్‌గేమ్ మాత్రమే ఈ రేంజ్‌లో కలెక్ట్ చేయడం గమనార్హం.

    దేశీయ బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు

    దేశీయ బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు

    ఇక స్వదేశంలో అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమాకు ఎదురేలేకుండా పోయింది. ఈ చిత్రం దాదాపు అన్ని చిత్రాల తొలిచిత్ర వసూళ్లను అధిగమించింది. బాహుబలి, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం వసూళ్లను అధిగమించింది. అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా రూ.53 కోట్లు వసూలు చేసింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యుత్తమ తొలిరోజు రికార్డు అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

     భాష ఏదైనా సినిమాకు ప్రేక్షకుల పట్టం

    భాష ఏదైనా సినిమాకు ప్రేక్షకుల పట్టం

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం సినిమా చరిత్రలో ఓ మేలుకొలుపు. ఎలాంటి సెలవులు, పండుగలు అనే విషయం లేకుండా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. తొలిరోజు వసూళ్లలో అవెంజర్స్ మైలురాయిగా నిలిచింది. మంచి కంటెంట్ ఉంటే భాష ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని అవెంజర్స్: ఎండ్‌గేమ్ నిరూపించింది అని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    English summary
    Marvel superhero movie 'Avengers: Endgame' set an opening-day record in China with an estimated $107.2 million in ticket sales, distributor Walt Disney Co said on Wednesday."Endgame" is the final chapter of a story told across 22 Marvel films featuring popular characters such as Iron Man, Thor and Black Widow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X