Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
చరిత్ర సృష్టించిన అవెంజర్స్.. అవతార్ రికార్డులు కూడా మటాష్
ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును అవెంజర్స్: ఎండ్ గేమ్ సృష్టించడానికి సిద్ధమైంది. గత 47 రోజులుగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. తాజా ట్రేడ్ వివరాల ప్రకారం.. జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ సినిమా వసూళ్లను ఓ అడుగులో అధిగమించేందుకు రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ ప్రస్తుతం ఆ రికార్డుకు చేరువలో అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం పొంచి ఉంది. అవెంజర్స్ చిత్రం 2.73 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతున్నది.

ఉత్తర అమెరికాలో
ఉత్తర అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్లతో అవెంజర్స్: ఎండ్ గేమ్ హోరెత్తించింది. ఈ చిత్రం 47వ రోజున కూడా 790000 డాలర్లను వసూలు చేయడం గమనార్హం. దాంతో ఈ సినిమా మొత్తంగా 825.825 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఇదో క్రేజీ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

జేమ్స్ కామెరాన్ ఆసక్తికరమైన ట్వీట్
అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం కొద్ది రోజుల క్రితం జేమ్స్ కామెరాన్ రూపొందించిన టైటానిక్ చిత్రం వసూళ్లను అధిగమించింది. ఆ సందర్భంగా కామెరాన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. గతంలో టైటానిక్ పడవను మంచు పర్వతం ముంచేస్తే.. ఇప్పుడు నా టైటానిక్‌ను అవెంజెర్స్ ముంచేసింది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇండియన్ బాక్సాఫీస్‌పై అవెంజర్స్ దాడి
అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం ఓవర్సీస్‌లోనే కాకుండా భారత్‌లో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. అన్ని భాషల్లో కలుపుకొని ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రలో దేశీయేతర చిత్రం ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.