twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్స్ వసూళ్ల తుఫాన్.. 10 వేల కోట్ల కనకవర్షం.. భారత్‌లో రూ.350 వైపు

    |

    ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ వసూళ్ల కనకవర్షం కురిపిస్తున్నది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వసూళ్ల తుఫాన్‌ను సృష్టిస్తున్నది. ఈ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించిన చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది. గతవారం రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    300 కోట్ల క్లబ్‌లో

    300 కోట్ల క్లబ్‌లో

    భారత్‌లో బుధవారం మేడే రోజు సెలవు దినం కావడం అవెంజర్స్ సినిమాకు కలిసి వచ్చింది. దాంతో గత రికార్డులను తిరగరాస్తూ సరికొత్త గణాంకాలను నమోదు చేసింది. ఈ చిత్రం భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రం ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. బుధవారం ఈ చిత్రం రూ.28.50 కోట్లు సాధించడం విశేషం. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.244.30 కోట్ల నికర వసూళ్లు.. రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    చైనాలోనూ ప్రభంజనం

    చైనాలోనూ ప్రభంజనం

    చైనాలో అవెంజర్స్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతున్నది. ఈ చిత్రం సుమారు 459 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 320 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఎనిమిదో రోజున కూడా కలెక్షన్లను ధీటుగా సంపాదించింది. బుధవారం రోజున రూ.52 కోట్లను వసూలు చేసింది. గురువారం కూడా చైనాలో హాలీడే కావడంతో మరిన్నీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా 10 వేల కోట్లతో

    ప్రపంచవ్యాప్తంగా 10 వేల కోట్లతో

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $1,481.1 మిలియన్ డాలర్లు అంటే 10.2 వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఎనిమిదో రోజు వసూళ్లను పోల్చుకొంటే ఈ సినిమా కెప్టెన్ మార్వెల్ సినిమా కలెక్షన్లను అధిగమించింది. ఇక అవెంజర్స్: ఎండ్‌గేమ్ ముందు ఫ్యూరియస్ 7, ది అవెంజర్స్, జురాసిక్ పార్క్, అవతార్, టైటానిక్, స్టార్ వార్స్, ఇన్ఫినిటీ వార్ చిత్రాల రికార్డులు ఉన్నాయి.

    8వ స్థానంలో అవెంజర్స్

    8వ స్థానంలో అవెంజర్స్

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 జాబితాలో నిలిచింది. 1405 మిలియన్ డాలర్లు వసూలు చేసిన అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, 1346 మిలియన్ డాలర్లు వసూలు చేసిన బ్లాక్ పాంథర్ చిత్రాలను అధిగమించి 8వ స్థానంలో ఎండ్ గేమ్ నిలిచింది.

    English summary
    Avengers: Endgame is on the record-breaking spree, not just in India, or in the US, but worldwide. The per day collections of the film are eye-popping and surprising even for those who were prepared for this storm at the Box Office. Avengers: Endgame has earned $1,481.1 million at the Worldwide Box Office which is a mind-numbing number.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X