13 వేల కోట్లు కొల్లగొట్టిన అవెంజర్స్.. ఆ మూవీ కంటే గొప్పనా? విమర్శకుల పెదవి విరుపు

ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం కుదిపేస్తున్నది. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తున్నది. ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అవతార్ రికార్డును అధిగమించేందుకు సుడిగాలి వేగంతో అవెంజర్స్ మూవీ దూసుకెళ్తున్నది. గత పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

 2 బిలియన్ డాలర్ల రికార్డుకు చేరువగా

2 బిలియన్ డాలర్ల రికార్డుకు చేరువగా

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం విజయవంతంగా రెండోవారంలోకి ప్రవేశించింది. ఈ చిత్రం వసూళ్లలో 2 బిలియన్ డాలర్ల రికార్డుకు చేరువైంది. త్వరలోనే అవతార్, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకన్స్ చిత్రాల కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 12590 కోట్లు అంటే 1.82 బిలియన్ డాలర్లను వసూలు చేసింది.

స్టార్ వార్స్ రికార్డుపై గురి

స్టార్ వార్స్ రికార్డుపై గురి

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2.78 బిలియన్ డాలర్లు (రూ.19321 కోట్లు) వసూలు చేయగా, స్టార్ వార్స్ చిత్రం 2.07 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ వారాంతం తర్వాత అవెంజర్స్ చిత్రం మొదట స్టార్ వార్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడతున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చివరి, 22వ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్రేజీగా

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్రేజీగా

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం భారత్‌లో రూ.400 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. తొలి రోజున ఈ చిత్రం రూ.50 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. రెండు రోజుల్లో రూ.100 కోట్లు, మూడో రోజున రూ.150 కోట్లు, ఐదో రోజున రూ.200 కోట్లు, 7వ రోజున రూ.250 కోట్లు, 10వ రోజున రూ.300 కోట్ల నికర వసూలు చేసింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు వసూలు చేసిన తొలి హాలీవుడ్ చిత్రంగా రికార్డుకెక్కుతుంది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

 అవతార్‌ మూవీతో పోల్చుకొంటే

అవతార్‌ మూవీతో పోల్చుకొంటే

ఇదిలా ఉండగా, అవెంజర్స్: ఎండ్‌గేమ్ వసూళ్లను తేలికగా తీసుకొన్నది. అవతార్, స్టార్ వార్స్ సాధించిన వసూళ్లతో పోల్చుకొంటే గొప్పేమీ కాదు. 2009 సంవత్సరంతో పోల్చుకంటే ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుటి రేట్లతో పోల్చుకొంటే అవతార్ కలెక్షన్లు 3 మిలియన్ డాలర్లు దాటి ఉండేవి. అవెంజర్స్‌తో పోల్చుకొంటే అవతార్ ప్రదర్శించిన థియేటర్లు కూడా తక్కువే అని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం

46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించిన చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X