Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాక్సాఫీస్‌ను హడలెత్తిస్తున్న అవెంజర్స్.. 300 కోట్లవైపు పరుగులు.. ఆరో రోజుల్లో ఎంత వసూలంటే!
ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం కాసుల పంట పడిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. గత ఆరు రోజులుగా బాక్సాఫీస్‌పై వసూళ్ల దాడి చేస్తూ రికార్డులను తిరగరాస్తున్నది. తక్కువ రోజుల్లోనే దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న ఈ చిత్రం రూ.250 కోట్ల వైపు పరుగులు పెడుతున్నది. గత 6 రోజుల్లో అవెంజర్స్ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..
రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు
భారీ అంచనాల మధ్య 2019 ఏప్రిల్ 26న రిలీజైన ఈ చిత్రం తొలి రోజునే రూ.53.60 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ అగ్రహీరోల సినిమాలను తలదన్నేలా ఈ చిత్రం వసూళ్లు రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. రెండో రోజునే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. శనివారం ఈ చిత్రం రూ.52.85 కోట్లు రాబట్టడం గమనార్హం.
వారాంతం తర్వాత అదే ఊపు.. జోరు
అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తడంతో మూడో రోజు సెలవు దినం ఆదివారం రోజున కూడా కలెక్షన్లు హోరు కొనసాగింది. ఆదివారం కూడా రూ.52.20 కోట్లు రాబట్టడంతో వసూళ్లు ఆకాశానికి అంటాయి. దాంతో దేశవ్యాప్తంగా పలు సినిమాలు సాధించిన రికార్డులు బ్రేక్ అయ్యాయి. అదే ఊపును కూడా వారాంతం తర్వాత కొనసాగడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బేజారెత్తాయి.
ఐదో రోజుకే రూ.200 కోట్లు
ఏ సినిమాకైనా కఠిన పరీక్షగా మారే సోమవారం కూడా కలెక్షన్ల పంట పడింది. సోమవారం రూ.31.05 కోట్లు, మంగళవారం రూ.26.10 కోట్లు సాధించడంతో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. హిందీ, ఇతర భాషల చిత్రాలకు భిన్నంగా అవెంజర్స్ చిత్రం వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించడంతో కలెక్షన్ల ప్రయాణం ఇప్పుడే ఆగేటట్టు కనిపించడం లేదనే మాట వ్యక్తమవుతున్నది.
అవెంజర్స్ టార్గెట్ రూ.400 కోట్లు
అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా కలెక్షన్లపై ట్రేడ్ అనలిస్టు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ స్పందించారు. అవెంజర్స్ కలెక్షన్ల సునామీకి ఇప్పుడే తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.215 కోట్ల నికర వసూళ్లను, 256.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా రూ.400 కోట్ల టార్గెట్‌ను సెట్ చేసిందనిపిస్తున్నది అని తరుణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు.
ఎట్రాక్షన్‌గా థానోస్‌కు రానా డబ్బింగ్
ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకొంటున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు. తెలుగు వెర్షన్లో సూపర్ విలన్ థానోస్‌కు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో డైలాగ్స్ పిల్లలకు ఆసక్తిని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండటం పాజిటివ్‌గా మారింది.