For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాక్సాఫీస్ను హడలెత్తిస్తున్న అవెంజర్స్.. 300 కోట్లవైపు పరుగులు.. ఆరో రోజుల్లో ఎంత వసూలంటే!

|

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం కాసుల పంట పడిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. గత ఆరు రోజులుగా బాక్సాఫీస్‌పై వసూళ్ల దాడి చేస్తూ రికార్డులను తిరగరాస్తున్నది. తక్కువ రోజుల్లోనే దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న ఈ చిత్రం రూ.250 కోట్ల వైపు పరుగులు పెడుతున్నది. గత 6 రోజుల్లో అవెంజర్స్ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..

రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు

రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు

భారీ అంచనాల మధ్య 2019 ఏప్రిల్ 26న రిలీజైన ఈ చిత్రం తొలి రోజునే రూ.53.60 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ అగ్రహీరోల సినిమాలను తలదన్నేలా ఈ చిత్రం వసూళ్లు రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. రెండో రోజునే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. శనివారం ఈ చిత్రం రూ.52.85 కోట్లు రాబట్టడం గమనార్హం.

వారాంతం తర్వాత అదే ఊపు.. జోరు

వారాంతం తర్వాత అదే ఊపు.. జోరు

అవెంజర్స్‌: ఎండ్‌గేమ్ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తడంతో మూడో రోజు సెలవు దినం ఆదివారం రోజున కూడా కలెక్షన్లు హోరు కొనసాగింది. ఆదివారం కూడా రూ.52.20 కోట్లు రాబట్టడంతో వసూళ్లు ఆకాశానికి అంటాయి. దాంతో దేశవ్యాప్తంగా పలు సినిమాలు సాధించిన రికార్డులు బ్రేక్ అయ్యాయి. అదే ఊపును కూడా వారాంతం తర్వాత కొనసాగడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బేజారెత్తాయి.

 ఐదో రోజుకే రూ.200 కోట్లు

ఐదో రోజుకే రూ.200 కోట్లు

ఏ సినిమాకైనా కఠిన పరీక్షగా మారే సోమవారం కూడా కలెక్షన్ల పంట పడింది. సోమవారం రూ.31.05 కోట్లు, మంగళవారం రూ.26.10 కోట్లు సాధించడంతో ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీ, ఇతర భాషల చిత్రాలకు భిన్నంగా అవెంజర్స్ చిత్రం వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించడంతో కలెక్షన్ల ప్రయాణం ఇప్పుడే ఆగేటట్టు కనిపించడం లేదనే మాట వ్యక్తమవుతున్నది.

అవెంజర్స్ టార్గెట్ రూ.400 కోట్లు

అవెంజర్స్ టార్గెట్ రూ.400 కోట్లు

అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా కలెక్షన్లపై ట్రేడ్ అనలిస్టు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ స్పందించారు. అవెంజర్స్ కలెక్షన్ల సునామీకి ఇప్పుడే తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.215 కోట్ల నికర వసూళ్లను, 256.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్వీట్ చేశాడు. ఈ సినిమా రూ.400 కోట్ల టార్గెట్‌ను సెట్ చేసిందనిపిస్తున్నది అని తరుణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు.

ఎట్రాక్షన్‌గా థానోస్‌కు రానా డబ్బింగ్

ఎట్రాక్షన్‌గా థానోస్‌కు రానా డబ్బింగ్

ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకొంటున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు. తెలుగు వెర్షన్‌లో సూపర్ విలన్ థానోస్‌కు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో డైలాగ్స్ పిల్లలకు ఆసక్తిని, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండటం పాజిటివ్‌గా మారింది.

English summary
After six days of its release, the much-awaited Hollywood flick Avengers: Endgame has managed to mint Rs. 200 crore. Trade analyst Taran Adarsh tweeted, "#AvengersEndgame refuses to slow down... Crosses 200 cr on Day 5 [Tue]... Sets sights on 400 cr... Fri 53.60 cr, Sat 52.20 cr, Sun 52.85 cr, Mon 31.05 cr, Tue 26.10 cr. Total: 215.80 cr Nett BOC. India biz. Gross BOC: 256.90 cr."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more