2 రోజుల్లో రూ. 100 కోట్లు: ఇండియాలో ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్’ వసూళ్ల సునామీ!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్ 'అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' కోసం ఎదురు చూసిన వారిలో ఇండియన్ ఫ్యాన్స్ కూడా భారీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ విదేశీ చిత్రానికి లేని విధంగా భారీ సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. రిలీజైన తర్వాత బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది.
ఇంగ్లీష్‌తో పాటు దేశీయ భాషల్లో విడుదలైన ది ఎండ్ గేమ్ ఓపెనింగ్ డే రోజు ఇండియా వైడ్ రూ. 53.10 కోట్లు నమోదు చేసింది. శనివారం కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గక పోవడంతో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మరింత కలిసొచ్చింది.

డిమాండుకు తగిన విధంగా గ్రాండ్ రిలీజ్
డిమాండుకు తగిన విధంగానే ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' చిత్రాన్ని ఇండియా వైడ్ గ్రాండ్‌గా విడుదల చేశారు. మొత్తం 2845 స్క్రీన్లలో విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడింది. చాలా చోట్ల టికెట్స్ దొరక్క ప్రేక్షకులు వెనుదిరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మర్ హాలిడేస్ కావడం కలిసిచ్చింది.

రికార్డులు బద్దలు
ఇప్పటి వరకు హిందీలో హయ్యెస్ట్ ఓపెనర్‌గా ఉన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' రికార్డులను ‘అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' బద్దలు కొట్టింది. అమీర్ ఖాన్ మూవీ తొలి రోజు రూ. 52.25 కోట్లు వసూలు చేయగా.... ‘ది ఎండ్ గేమ్' రూ. 53.10 కోట్లు రాబట్టింది.

రెండో రోజూ కలెక్షన్స్ కళకళ
రెండో రోజు సైతం సినిమా వసూళ్లు అదిరిపోయాయి. ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం శనివారం రూ. 60 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో టోటల్ 2 డేస్ ఇండియా కలెక్షన్ రూ. 100 కోట్ల మార్కను రీచ్ అయినట్లయింది. సెకండ్ డే కలెక్షన్స ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అనేది తెలియాల్సి ఉంది.

సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' చూసిన ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. క్లైమాక్స్‌లో ఐరన్ మ్యాన్ పాత్ర చనిపోవడమే ఇందుకు కారణం. ఇక అవెంజర్స్ సిరీస్ చిత్రాలకు ఇది ముగింపు అని తెలిసి చాలా మంది అభిమానులు ఫీలవుతున్నారు.


Click it and Unblock the Notifications











