రూ.8381 కోట్ల కలెక్షన్: ‘అవెంజర్స్:ది ఎండ్ గేమ్’ దెబ్బకు వణికిపోతున్న ఇంటర్నేషనల్ బాక్సాఫీస్!

Recommended Video

Avengers: Endgame Movie Breaks Box-Office Records || Filmibeat Telugu

మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన 'అవెంజర్స్: ది ఎండ్ గేమ్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ సునామీ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.2 బిలియన్ డాలర్లు(రూ.8381 కోట్లు)కు రీచ్ అయింది. మరో రెండు వారాల్లో 2 బిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఫోర్బ్స్ కథనం ప్రకారం.. అవెంజర్స్:ది ఎండ్ గేమ్ నార్త్ అమెరికాలో $350 మిలియన్ (రూ. 2444 కోట్లు) వసూలు చేసింది. సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో $859 మిలియన్ (రూ. 5999 కోట్లు) వసూలు చేసింది.

అత్యంత వేగంగా 1 బిలియన్

అత్యంత వేగంగా 1 బిలియన్

అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అత్యంత వేగంగా 1 బిలియన్ డాలర్ మార్కను అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు అనేక రికార్డులను బద్దలు కొట్టింది. డిస్నీ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాలు ప్రకటించింది.

ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు

ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు

నార్ అమెరికాలో $350 మిలియన్ వసూలు చేసింది. దీంతో ఇంతకు ముందు ఇన్ఫినిటీ వార్ వసూలు చేసిన $257.6 మిలియన్ రికార్డును తుడిచేసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో $850 మిలియన్ రాబట్టింది. దీంతో 2017లో వచ్చిన ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్' ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద నెలకొల్పిన $441.1 మిలియన్ రికార్డును బద్దలు కొట్టింది.

చైనాలో వసూళ్ల సునామీ, ఇండియాలో రూ. 100 కోట్లు

చైనాలో వసూళ్ల సునామీ, ఇండియాలో రూ. 100 కోట్లు

చైనాలో ఓపెనింగ్ డే రోజు 107.8 మిలియన్ డాలర్ రాబట్టింది. ఐమాక్స్ థియేటర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా $91.5 మిలియన్లు రాబట్టింది. ఇక ఇండియాలో తొలి 2 రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది.

5 రోజుల్లోనే పెట్టుబడి రికవరీ, త్వరలో 2 బిలియన్

5 రోజుల్లోనే పెట్టుబడి రికవరీ, త్వరలో 2 బిలియన్

సినిమా విడుదలైన తొలి 5 రోజుల్లోనే డిస్నీ సంస్థ ఈ సినిమా కోసం వెచ్చించిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకుంటోంది. ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ ఏమీ లేక పోవడంతో త్వరలోనే 2 బిలియన్ డాలర్ మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

టికెట్ రేట్లు భారీగా ఉన్నప్పటికీ

టికెట్ రేట్లు భారీగా ఉన్నప్పటికీ

విదేశాల్లో సినిమా టికెట్ కాస్ట్ ఫస్ట్ వీకెండ్ భారీగా పెంచేశారు. కొందరు ఫ్యాన్స్ ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్' చిత్రాన్ని తొలిరోజే పైరసీ చూశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది టికెట్ కాస్ట్ తగ్గడంతో పైరసీ చూసిన వారు సైతం తిరిగి థియేటర్లకు వస్తున్నారు. దీని ద్వారా డిస్నీ సంస్థకు అదనపు ఆదాయం వస్తుంది.

ఒక రాత్రిలో వచ్చిన విజయం కాదు

ఒక రాత్రిలో వచ్చిన విజయం కాదు

‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్' సక్సెస్ అనేది కేవలం ఒక రాత్రిలో వచ్చింది కాదు. ఇప్పటి వరకు అవెంజర్స్ సీరిస్‌లో 22 చిత్రాలు వచ్చాయి. ఆ సినిమాల కారణంగా ‘ది ఎండ్ గేమ్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఏర్పడ్డారు. అంతా ఈ చిత్రాన్ని ఫస్ట్ డే చూసేందుకు పోటీ పడ్డారు. దాని ఫలితమే ఈ కలెక్షన్ల సునామీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X