‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్: బాహుబలి2తో పాటు అన్ని రికార్డులు ఢమాల్!
మార్వెల్ యూనివర్శ్ నుంచి వచ్చిన సూపర్ హీరోస్ మూవీ 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఇండియన్ బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. గురువారంతో విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 260 కోట్ల నెట్, రూ. 310 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు హిందీ చిత్ర సీమలో ఉన్న అన్ని కార్డులను బద్దలు కొట్టింది.
ఈ చిత్రానికి సంబంధించిన రోజువారీ వసూళ్లను ప్రముఖ మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలి రోజైన శుక్రవాం రూ. 53.60 కోట్లు, శనివారం రూ. 52.20 కోట్లు, ఆదివారం రూ. 52.85 కోట్లు, సోమవారం రూ. 31.05 కోట్లు, మంగళవారం రూ. 26.10 కోట్లు, బుధవారం రూ. 28.50 కోట్లు, గురువారం 16.10 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.

ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు
తొలివారం వసూళ్ల తర్వాత ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నింటికీ బద్దలుకొట్టి చరిత్ర సృష్టించింది. హిందీ వెర్షన్‌లో బాహుబలి 2 మూవీ నెలకొల్పిన రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. ఒక విదేశీ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి.

టాప్ 5 రికార్డులు ఇవే, అన్నీ ఢమాల్
ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న టాప్ 5 ఫస్ట్ వీక్ కలెక్షన్ రికార్డులను ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' అధిగమించింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1. అవెంజర్స్-ది ఎండ్ గేమ్ రూ. 260.40 కోట్లు
2. బాహుబలి 2(హిందీ) రూ. 247 కోట్లు
3. సుల్తాన్ రూ. 229.16 కోట్లు (బుధవారం రిలీజ్, టోటల్ 9 డేస్)
4. టైగర్ జిందా హై రూ. 206.04 కోట్లు
5. సంజు రూ. 202.51 కోట్లు
6. దంగల్ రూ. రూ 197.54 కోట్లు

కలెక్షన్ అలా పెరుగుతూ వచ్చాయి
‘అవెంజర్స్ ది ఎండ్ గేమ్' రూ. 100 కోట్ల మార్కును కేవలం 2 రోజుల్లోనే అందుకుంది. మూడు రోజుల్లో రూ. 150 కోట్లు, 5 రోజుల్లో రూ. 200 కోట్లు, 7 రోజుల్లో రూ. 250 కోట్ల మార్కను రీచ్ అవ్వడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రపంచ బాక్సాఫీసు వద్ద సంచలనం
మరో వైపు ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు వద్ద సైతం సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు 1.6 బిలియన్ డాలర్లు(రూ. 10 వేల కోట్ల పైనే) వసూలు చేసింది. 2012లో వచ్చిన ‘అవెంజర్స్-ఏజ్ ఆప్ ఆల్ట్రాన్' లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డును క్రాస్ చేసింది. త్వరలో 2 బిలియన్ డాలర్ మార్కును అందుకుని ఇప్పటి వరకు వచ్చిన అవెంజర్స్ అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని తేలిపోయింది.

వరల్డ్ నెం.1 రికార్డ్ సొంతం చేసుకుంటుందా?
అయితే ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు 2.7 బిలియన్ డాలర్ల వసూళ్లతో జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్' నెం.1 స్థానంలో ఉంది. మరి దీన్ని ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' అధిగమిస్తుందా? ఎన్ని రోజుల్లో ఇది సాధ్యమవుతుంది? అనేది హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











