twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్స్: ది ఎండ్ గేమ్... ఇండియా, వరల్డ్ వైడ్ టాప్ 10 రికార్డ్స్

    |

    అవెంజర్స్: ది ఎండ్ గేమ్ ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెంట్ వరల్డ్ వైడ్ దాదాపు రూ. 1.2 బిలియన్ (రూ.8381 కోట్లు) వసూలు చేసింది.

    యూఎస్ఏ, చైనా, ఇండియా ఇలా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ సూపర్ హీరోస్ మూవీ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని రికార్డులు సాధిస్తోంది. ఇండియాతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం నెలకొల్పిన టాప్ 10 రికార్డులపై ఓ లుక్కేద్దాం.

    బాలీవుడ్ ఫిల్మ్ రికార్డులు బద్దలు

    బాలీవుడ్ ఫిల్మ్ రికార్డులు బద్దలు

    ‘అవెంజర్స్ ది ఎండ్ గేమ్' హిందీ వెర్షన్ ఫస్ట్ వీకెండ్ రూ. 187.14 కోట్ల గ్రాస్ సాధించగా... ఇందులో రూ. 157.20 కోట్ల నెట్ వసూలు చేసింది. హిందీలో తొలివారాంతం ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి. దీంతో పాటు ఇండియాలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

    ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్

    ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్

    శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ఇండియా వైడ్ రూ. 53 కోట్లు రాబట్టింది. బాహుబలి-ది కంక్లూజన్ (రూ. 121 కోట్లు) తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇదే. ఇంతకు ముందు అమీర్ ఖాన్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'(రూ. 52.25) ఆస్థానంలో ఉండగా వెనక్కి నెట్టేసింది.

    బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఓపెనర్

    బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ ఓపెనర్

    సూపర్ హీరోర్ అంతా కలిసి నటించిన అవెంజర్స్-ది ఎండ్ గేమ్ వరల్డ్ హయ్యెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాది విడుదలైన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ $640 మిలియన్లతో మొదటి స్థానంలో ఉండగా... అంతకు రెట్టింపు వసూళ్లు $1.2 బిలియన్ డాలర్లతో ది ఎండ్ గేమ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

    ఫాస్టెస్ట్ 1 బిలియన్ మూవీ

    ఫాస్టెస్ట్ 1 బిలియన్ మూవీ

    మార్వెల్ కామిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం అత్యంత వేగంగా 1 బిలియన్ మార్క్ అందుకున్న చిత్రంగా రికార్డుల కెక్కింది. కేవలం 5 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. చాలా దేశాల్లో ఈ చిత్రం బుధవారమే విడుదలైంది. కాగా... అంతకు ముందు ఇన్ఫినిటీ వార్ 11 రోజుల్లో 1 బిలియన్ రీచ్ అయింది.

    చైనాలో హయ్యెస్ట్

    చైనాలో హయ్యెస్ట్

    చైనాలో అవెంజర్స్ -ది ఎండ్ గేమ్ 5 రోజుల్లో $330.5 మిలియన్ల వసూలు చేసింది. చైనా సినీ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ రికార్డ్. లోకల్ చైనా చిత్రాలకు కూడా ఇంత మొత్తం సాధించలేదు. తొలి రోజు ఏకంగా $107.8 మిలియన్లు వసూలు చేసింది.

    నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ ఓపెనర్

    నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ ఓపెనర్

    ఉత్తర అమెరికా ఖండంలో ఈ చిత్రం $350 వసూలు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు ఇన్ఫినిటీ వార్ ($257 మిలియన్లు), స్టార్ వార్స్: ది ఫోర్స్ అవాకెన్స్($248) టాప్ పొజిషన్లో ఉండేవి. ఇపుడు ఆ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

    హయ్యెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ

    హయ్యెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ

    ఉత్తర అమెరికా బయట $859 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ద్వారా ఇతర దేశాల్లో భారీ మొత్తం వసూలు చేసిన చిత్రంగా ది ఎండ్ గేమ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ ‘ది ఫేట్ ఆప్ ది ప్యూరియస్'($443 మిలియన్లు) పేరు మీద ఉండేది.

    44 దేశాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

    44 దేశాల్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్

    ఆస్ట్రేలియా, చైనా, కొరియా, బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, స్పెయిన్ ఇలా మొత్తం 44 దేశాల్లో ఈ చిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించి అప్పటి వరకు ఆయా దేశాల్లో ఉన్న రికార్డెలన్నింటినీ బద్దలు కొట్టింది.

    ఐమాక్స్, 3డి రికార్డ్స్

    ఐమాక్స్, 3డి రికార్డ్స్

    అవెంజర్స్ ఎండ్ గేమ్ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలైన చిత్రాల కేటగిరీలో సైతం అత్యధిక మొత్తం వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఐమాక్స్ స్క్రీనింగ్ ద్వారా $91.5 రాబట్టింది. దీంతో పాటు 3డి పార్మాట్లో $540 మిలియన్ డార్లు రాబట్టింది.

    ఇండియాలో హయ్యెస్ట్ హాలీవుడ్ ఓపెనర్

    ఇండియాలో హయ్యెస్ట్ హాలీవుడ్ ఓపెనర్

    ఇక ఇండియాలో హయ్యెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా సరికొత్త రికార్డు సాధింది. ఈ చిత్రం తొలి రోజు 53 కోట్లు వసూలు చేసింది. గతేడాది విడుదలైన ఇన్ఫినిటీ వార్ చిత్రం రూ. 31 కోట్లు వసూలు చేసింది. ఇపుడు ఆ మూవీ సెకండ్ పొజిషన్లోకి వెళ్లిపోయింది.

    English summary
    Avengers: The Endgame movie top 10 record. Marvel's Avengers Endgame movie has officially become the biggest movie of all time with earning $1.2 billion. The Movie will manage to cross $2 billion marks in the next two weeks only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X